Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsకరీంనగర్క్రైంజిల్లా వార్తలుతెలంగాణ

మహారాష్ట్ర టు కరీంనగర్‌.. గంజాయి సరఫరా గుట్టురట్టు.!

గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను కొత్తపల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం.. రేకుర్తి శేఖబి కాలనీకి చెందిన మహమ్మద్ మున్నా, మహమ్మద్ షారుక్ గత కొంతకాలంగా మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి కరీంనగర్‌కు తీసుకొస్తున్నారు.

మహారాష్ట్ర టు కరీంనగర్‌.. గంజాయి సరఫరా గుట్టురట్టు.!

రేకుర్తిలో ఇద్దరు అరెస్ట్‌.. 2.2 కిలోలు గంజాయి, సెల్‌ఫోన్లు స్వాధీనం

కరీంనగర్‌ బ్యూరో, నరేష్, మనసాక్షి :

గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను కొత్తపల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం.. రేకుర్తి శేఖబి కాలనీకి చెందిన మహమ్మద్ మున్నా, మహమ్మద్ షారుక్ గత కొంతకాలంగా మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి కరీంనగర్‌కు తీసుకొస్తున్నారు.

చిన్నచిన్న ప్యాకెట్లుగా తయారు చేసి విద్యార్థులు, ఇతరులకు అధిక ధరలకు విక్రయిస్తూ అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నారు. ఈ క్రమంలో 15 రోజుల క్రితం మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు వెళ్లి గుర్తుతెలియని వ్యక్తుల నుంచి కిలో రూ.20 వేల చొప్పున 2.2 కిలోల గంజాయి కొనుగోలు చేశారు. రేకుర్తికి తీసుకొచ్చి కిలో రూ.50 వేల చొప్పున విక్రయించేందుకు సిద్ధమయ్యారు.

ఈ క్రమంలో సమ్మక్క గద్దెల సమీపంలోని కెనాల్‌ కాలువ వెంబడి గంజాయితో వెళ్తుండగా కొత్తపల్లి ఎస్సై సాంబమూర్తి తన సిబ్బందితో పెట్రోలింగ్‌ నిర్వహిస్తూ వారిని గుర్తించారు. పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించగా పట్టుకుని తనిఖీ చేశారు. వారి వద్ద ఉన్న సంచిలో 2.2 కిలోల గంజాయి గుర్తించారు.

పంచుల సమక్షంలో పంచనామా నిర్వహించి గంజాయితో పాటు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కొత్తపల్లి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి అరెస్టు అనంతరం రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌హెచ్‌వో బిల్లా కోటేశ్వర్‌ తెలిపారు. గంజాయి విక్రయదారులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్సై సాంబమూర్తితో పాటు హెడ్‌ కానిస్టేబుళ్లు హరికేశవ్‌, పరశురాములు, కానిస్టేబుళ్లు శ్రీనాథ్‌, వెంకటేశ్‌, శ్రీనివాస్‌, శివను సీఐ అభినందించారు.

మరిన్ని వార్తలు