Breaking Newsకరీంనగర్జిల్లా వార్తలు
రేకుర్తి జనావాసాల్లో కొండచిలువ ప్రత్యక్షం.. భయాందోళనకు గురైన స్థానికులు
కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని 29వ డివిజన్ రేకుర్తి స్వామి కాలనీలో కొండచిలువ ప్రత్యక్షం కావడంతో స్థానికంగా కలకలం రేగింది.

రేకుర్తి జనావాసాల్లో కొండచిలువ ప్రత్యక్షం.. భయాందోళనకు గురైన స్థానికులు
కరీంనగర్ బ్యూరో – నరేష్, మనసాక్షి :
కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని 29వ డివిజన్ రేకుర్తి స్వామి కాలనీలో కొండచిలువ ప్రత్యక్షం కావడంతో స్థానికంగా కలకలం రేగింది. కాలనీలోని జనావాసాల మధ్య కొండచిలువ కనిపించడంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియని కొండచిలువ కాలనీలో సంచరిస్తుండటంతో ప్రజలు అప్రమత్తమయ్యారు.
Also Read : ఎల్‌ఎల్‌బీ విద్యార్థిని ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్.. నిందితుడి అరెస్ట్..!
అయితే భయపడకుండా కొందరు స్థానికులు ధైర్యంగా ముందుకు వచ్చి చాకచక్యంగా కొండచిలువను పట్టుకున్నారు. దీంతో కాలనీవాసులు ఊపిరి పీల్చుకున్నారు. సకాలంలో స్పందించి కొండచిలువను పట్టుకోవడంతో ప్రమాదం తప్పిందని స్థానికులు భావిస్తున్నారు. జనావాసాల మధ్య పాములు, కొండచిలువలు కనిపిస్తుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు.









