Rythu Runa Mafi : రుణమాఫీ పై కేసీఆర్ కీలక ప్రకటన అప్పుడేనా..?

Rythu Runa Mafi : రుణమాఫీ పై కేసీఆర్ కీలక ప్రకటన అప్పుడేనా..?
మన సాక్షి , వెబ్ డెస్క్ :
తెలంగాణలో బి ఆర్ ఎస్ ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి వచ్చాక రైతులకు లక్ష రూపాయల వరకు పంట రుణాలను మాఫీ చేస్తామని అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విషయం విధితమే. అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్ నాలుగు విడతలుగా లక్ష రూపాయల లోపు రుణాలు ఉన్నవారికి మాఫీ చేయనున్నట్లు ప్రకటించారు. కాగా ఇప్పటివరకు రెండు విడతలుగా మాత్రమే రైతులకు పంట రుణాలను మాఫీ చేశారు.
మొదటి విడతగా 25 వేల రూపాయల లోపు బ్యాంకులలో పంట రుణాలు ఉన్న రైతులకు మాఫీ చేశారు. రెండవ విడతలో 50వేల లోపు బ్యాంకులలో పంట రుణాలు ఉన్న రైతుల రుణాలను మాఫీ చేశారు. కానీ అర్హులైన రైతుల జాబితాలో కేవలం 70 శాతం మందికి మాత్రమే పంట రుణాలు మాఫీ అయ్యాయి.
ప్రస్తుతం రూ. 50 వేలకు పైగా నుంచి లక్ష రూపాయల రుణాలు ఉన్నవారు మాఫీ హామీ కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం వానాకాలం సీజన్ ప్రారంభమవుతున్నందున బ్యాంకులలో పంట రుణాల రీ షెడ్యూల్ చేసే గడువు వచ్చింది. కాగా బ్యాంకులలో రుణాలను రైతులు రీ షెడ్యూల్ చేసుకోవాలని ఆయా బ్యాంకుల నుంచి రైతులపై ఒత్తిడి చేస్తున్నారు. కానీ రైతులు మాత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల హామీలో భాగంగా లక్ష రూపాయల లోపు రుణాలను మాఫీ చేస్తారని ఆయన ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు.
ALSO READ : హైదరాబాద్ | టీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్… ఇక అందరికీ బస్ పాస్ లు.. సగం డబ్బులు ఆదా..!
ఎన్నికలు సమీపిస్తున్నందున పంట రుణాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించి మాఫీ ప్రకటించే అవకాశాలు ఉన్నాయని రైతులు ఎదురుచూస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి రావడానికి ప్రధాన కారణంగా రైతులే అని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
రైతులకు రైతుబంధు పథకం ద్వారా ఎకరానికి సంవత్సరంలో పదివేల రూపాయల పంట సహాయం చేస్తున్నారు. దాంతోపాటు రైతు బీమా… ఈ పథకం ద్వారా రైతులకు ఐదు లక్షల రూపాయల భీమాను అందజేస్తున్నారు. ఒక గుంట వ్యవసాయ భూమి ఉన్న రైతు కూడా చనిపోతే ఐదు లక్షల రూపాయల భీమా సౌకర్యాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం కల్పిస్తుంది. అంతేకాకుండా రైతులకు ఉచిత కరెంటును అందజేస్తుంది. ఈ మూడు పథకాల వల్ల రెండవ సారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
ALSO READ : Central Govt : కేంద్రం కీలక నిర్ణయం.. సామాన్యులకు ఊరట..!
రుణమాఫీ ..?
రెండవసారి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి రుణమాఫీ హామీ కూడా ప్రధాన కారణంగా ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. కానీ అధికారంలోకి వచ్చాక కేవలం రెండు విడతలు మాత్రమే రుణమాఫీ పథకాన్ని అమలు చేశారు. లక్ష రూపాయల లోపు రుణాలు ఉన్న రైతులు ప్రభుత్వంపై కొంత మేరకు ఆగ్రహంతో ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి .
కాగా ఎన్నికల సమయం దగ్గర పడటమే కాకుండా ప్రతిపక్ష పార్టీలు ముందస్తుగానే రుణమాఫీ హామీలను గుప్పిస్తున్నాయి. అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఇచ్చిన హామీని అమలు చేయకపోవడంతో రైతుల్లో వ్యతిరేకత వస్తుందని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అందుకుగాను ఈ సీజన్ లోనే రుణమాఫీ పై ముఖ్యమంత్రి కెసిఆర్ కీలకమైన ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయి.
ప్రస్తుతం తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు సాగుతున్నాయి. ఈ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగానే రైతులకు ముఖ్యమంత్రి కేసీఆర్ తీపి కబురు చెప్పబోతున్నట్లు సమాచారం . 2018 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన రైతు రుణమాఫీ హామీని అమలు చేసే దిశగా ప్రయత్నం సాగుతుంది.
లక్ష రూపాయల లోపు పంట రుణాలు ఉన్న రైతులకు ఆయా బ్యాంకులలో మాఫీ చేసే విధంగా కేసీఆర్ ప్రకటించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. రుణమాఫీ పై అధికారికంగా ఎలాంటి ప్రకటన రాకపోయినప్పటికీ కెసిఆర్ రుణమాఫీ పై ప్రకటిస్తారని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.