Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESఆంధ్రప్రదేశ్జాతీయంతెలంగాణ

Central Govt : కేంద్రం కీలక నిర్ణయం.. సామాన్యులకు ఊరట..!

Central Govt : కేంద్రం కీలక నిర్ణయం.. సామాన్యులకు ఊరట..!

మనసాక్షి, డెస్క్:

కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు ఊరట కలిగే విధంగా కీలక నిర్ణయం తీసుకుంది. నిత్యవసర వస్తువుల బ్లాక్ మార్కెట్ లేకుండా చేసేందుకు ధరల నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీంతో నిత్యవసర వస్తువుల ధరలు కొంతమేరకు తగ్గి సామాన్యులకు ఊరట కలిగే అవకాశం ఉంది.

 

మార్కెట్ లో ఇటీవల కందిపప్పు ,మినప పప్పు ధర లు క్రమంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. కాగా దీనిని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. నిల్వల సామర్థ్యం పై ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల ధరలకు కళ్లెం పడే అవకాశం ఉంది. అక్టోబర్ 31వ తేదీ వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని వెల్లడించింది.

 

వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. కందిపప్పు ,మినప పప్పు వంటి వాటిపై ఇకపై నిల్వల సామర్థ్యం లిమిట్స్ ఉంటాయని పేర్కొన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు లిమిట్స్ ఆంక్షలు అమల్లోకి వస్తాయన్నారు.

 

కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల హోల్ సేల్ డీలర్లు 200 టన్నుల వరకు కందిపప్పు, లేదా 200 టన్నుల వరకు మినపపప్పును నిల్వ చేసుకునే అవకాశం ఉంది. అదే రిటైల్ వ్యాపారులు అయితే కేవలం ఐదు టన్నుల చొప్పున కందిపప్పు, మినప పప్పు వంటి వాటిని నిల్వ చేసుకోవచ్చు. ఇంకా.. లార్జ్ చైన్ రిటైలర్ ఐతే 200 టన్నుల చొప్పున కందిపప్పు, మినపప్పు నిల్వ చేసుకోవచ్చును.

 

ALSO READ : Wifi : మీ వైఫై రూటర్ 24 గంటలు ఆన్ లోనే ఉంచుతున్నారా..? అయితే ఇది చూడాల్సిందే ..!

ఇంకా మిల్లు ఓనర్లు అయితే వార్షిక కెపాసిటీలో కానీ మొత్తం ఉత్పత్తిలో గానీ 25% వరకు మాత్రమే నిల్వ చేసుకునే అవకాశం ఉంది. దిగుమతి దారులు కష్టం క్లియరెన్స్ తర్వాత 30 రోజులకు మించి విలువ చేసుకునే అవకాశం లేదు. ఈ నిర్ణయం వల్ల అక్రమ నిల్వలు తగ్గి బ్లాక్ మార్కెటింగ్ లేకుండా ధరల నియంత్రణ ఉంటుంది.

ప్రస్తుత మార్కెట్ ప్రకారం కందిపప్పు ధర కేజీ 102 రూపాయలు ఉంది. వార్షికంగా చూస్తే 19% ధర పెరిగింది. ఏడాది కిందట కందిపప్పు రేటు 103 రూపాయలుగా ఉంది. అదే విధంగా మినప పప్పు ధర చూస్తే కేజీ 110 రూపాయలుగా ఉంది. ఏడాది కిందట ఇదే మినప పప్పు రేటు 105 రూపాయలు కేజీ ఉండేది.

ALSO READ : Railway Stations : విదేశాలకు వెళ్లేందుకు ఫ్లైటే కాదు.. భారత్ లో ఏడు రైళ్లు..! అవి ఎక్కడో తెలుసుకుందాం..!

నూతన నిబంధనల ప్రకారం ధరలను నియంత్రించే అవకాశం ఉంది. దానివల్ల సామాన్యులకు కొంతమేర ఊరట కలిగే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు