Railway Stations : విదేశాలకు వెళ్లేందుకు ఫ్లైటే కాదు.. భారత్ లో ఏడు రైళ్లు..! అవి ఎక్కడో తెలుసుకుందాం..!

Railway Stations : విదేశాలకు వెళ్లేందుకు ఫ్లైటే కాదు.. భారత్ లో ఏడు రైళ్లు..! అవి ఎక్కడో తెలుసుకుందాం..!

మనసాక్షి , వెబ్ డెస్క్ :

విదేశాలకు వెళ్లాలంటే ప్రతి ఒక్కరు విమానం ఎక్కాల్సిందే అని అనుకుంటారు. కానీ మన దేశంలో రైళ్ల ద్వారా కూడా పొరుగు దేశాలకు వెళ్లే అవకాశం ఉంది. భారతదేశంలో ఏడు రైళ్ల విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది

అలాంటి రైల్వే స్టేషన్లు దేశంలో ఏడు చోట్ల ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం…

 

ALSO READ : Phonepe : ఫోన్ పే వాడుతున్నారా…? అయితే మీకు ఓ గుడ్ న్యూస్..!

హాల్ది భారీ : ఈ స్టేషన్ పశ్చిమ బెంగాల్లో ఉంది. ఈ స్టేషన్ నుంచి బంగ్లాదేశ్ కు సులభంగా వెళ్లవచ్చు. ఇక్కడి నుంచి బంగ్లాదేశ్ కు కేవలం 4.5 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది

 


అట్టారి స్టేషన్ : ఇది పంజాబ్ లో ఉంది. ఇక్కడి నుంచి పాకిస్తాన్ కు రైలు వెళుతుంది. ఇది వారానికి రెండు రోజులు నడుస్తుంది. పాకిస్తాన్ వెళ్లేవారు దీని ద్వారా వెళ్లవచ్చును.

 

జోగ్ బాని : ఈ రైల్వే స్టేషన్ నేపాల్ కు చాలా దగ్గరగా ఉంటుంది. బీహార్ లో ఉంది. ఇక్కడి నుంచి నేపాల్ చేరుకోవడానికి రైలులో వెళ్లొచ్చు. కొంతమంది కాలినడకన కూడా వెళ్తుంటారు.

జై నగర్ : ఈ రైల్వే స్టేషన్ బీహార్ లో మధుబని లో ఉంది. ఇక్కడి నుంచి నేపాల్ కు రైళ్లు వెళుతుంటాయి. ఇండియా – నేపాల్ రైలు నడుస్తుంది. మీరు సులభంగా నేపాల్ వెళ్లడానికి ఈ రైలు ద్వారా వెళ్ళవచ్చును.

 

ALSO READ : Central scheme : కేంద్ర ప్రభుత్వ పథకం.. నెలకు రూ. 10 వేలు ఎవరైనా పొందొచ్చు

 

పెట్రా పోల్ : ఈ రైల్వే స్టేషన్ నుంచి కూడా బంగ్లాదేశ్ కు వెళ్ళవచ్చు. ఈ రెండు దేశాల మధ్య ఎక్కువగా ఎగుమతి ,దిగుమతికి ఉపయోగ పడుతుంది.

సింగబాద్ : ఇది పశ్చిమబెంగాల్లోని మాల్దా జిల్లాలో ఉందివ ఇక్కడి నుంచి కూడా రోహన్పూర్ మీదుగా బంగ్లాదేశ్ కు రైళ్లు అందుబాటులో ఉన్నాయి .

రాధికాపూర్ : ఈ రైల్వే స్టేషన్ ఎక్కువగా రవాణా సౌకర్యం కోసం ఉపయోగిస్తుంటారు. దీనిని జీరో రైల్వే స్టేషన్ అని కూడా పిలుస్తారు. ఇది కూడా పశ్చిమబెంగాల్ లో ఉంది. ఇక్కడి నుంచి బంగ్లాదేశ్ కు రైళ్లు నడుస్తుంటాయి.

ALSO READ : Whatsapp : వాట్సాప్ లో అదిరిపోయే ఫీచర్ స్క్రీన్ షేరింగ్.. ఎలా చేయాలో తెలుసుకుందాం..!