Central scheme : కేంద్ర ప్రభుత్వ పథకం.. నెలకు రూ. 10 వేలు ఎవరైనా పొందొచ్చు

Central scheme : కేంద్ర ప్రభుత్వ పథకం.. నెలకు రూ. 10 వేలు ఎవరైనా పొందొచ్చు..!
మనసాక్షి , వెబ్ డెస్క్:
కేంద్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొస్తుంది. కానీ అవి చాలామందికి తెలియక ఉపయోగించుకోలేకపోతున్నారు. ఈ పథకం ద్వారా భార్యాభర్తలు ఇద్దరు నెలకు పదివేల రూపాయల బెనిఫిట్ పొందవచ్చు. వివరాలు తెలుసుకోండి …
అటల్ పెన్షన్ యోజన పథకం కింద పదవీ విరమణ అనంతరం జీవితం కోసం స్వచ్ఛందంగా పొదుపు చేసుకునేలా ఈ పథకం ప్రోత్సహిస్తుంది. 18 ఏళ్ల నుంచి 40 సంవత్సరాల మధ్య వయసున్న ప్రతి ఒక్కరు ఈ పథకంలో చేరవచ్చు . ఈ పథకంలో తమ పేరును నమోదు చేసుకునే అర్హత ఉంటుంది.
కార్మికులకు, ముఖ్యంగా వృద్ధులకు ఆదాయ భద్రత కల్పించేందుకు గాను కేంద్ర ప్రభుత్వం అటల్ పెన్షన్ యోజన పథకాన్ని తీసుకువచ్చింది. దీనిని 2015 బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. ఆ తర్వాత 2015 మే 9వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కోల్ కతాలో ఈ పథకాన్ని ప్రారంభించారు.
Also Read : PM KISAN : పి ఎం కిసాన్ డబ్బులు ఎకౌంట్లోకి రావాలంటే రైతులు ఇలా చేయాలి..!
60 ఏళ్లు నిండిన నాటి నుంచి ఈ పథకం కింద నెలకు ఒక వెయ్యి రూపాయల నుంచి 5వేల రూపాయల వరకు కనీస పింఛన్ హామీ ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలలో బాగా పాపులర్ అయిన పథకం ఇదే. 2021 – 22లో ఈ స్కీం లో 64 లక్షల మంది చేరారు. ఇప్పటికీ ఈ పథకంలో చేరిన వారి సంఖ్య 4 కోట్లు మందిగా నమోదు కావడం విశేషంగా ఉంది.
ఈ పథకంలో భార్యాభర్తలు ఇద్దరు చేరవచ్చు. ఇద్దరికీ 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 5000 రూపాయల చొప్పున ఇద్దరు 10 వేల రూపాయలు తీసుకునే అవకాశం ఉంటుంది. వయస్సు ఎంత తక్కువగా ఉన్నప్పుడు ఈ పథకంలో చేరితే పొదుపు చేస్తే అంత ఎక్కువ లాభం వచ్చే అవకాశం ఉంది.
అటల్ పెన్షన్ యోజన పథకంలో 18 ఏళ్లు ఉన్నప్పుడు చేరితే నెలకు 42 రూపాయల నుంచి 210 వరకు చెల్లించాల్సి ఉంటుంది. వయసు పెరుగుతున్న కొద్దీ ఈ మొత్తం పెరుగుతూ ఉంటుంది.
అటల్ పెన్షన్స్ స్కీం కింద కనీసం 20 సంవత్సరాల వరకు చెల్లించాల్సి ఉంటుంది. నెలవారి , క్వార్టర్లీ, అర్ధవార్షికం చొప్పున ఈ స్కీమ్లో కంట్రిబ్యూషన్ చేయొచ్చు.
Aldo Read : Good News : దక్షిణ మధ్య రైల్వే లో ఉద్యోగాలు, వేతనం 44,900
ఈ పథకాన్ని అన్ని జాతీయ బ్యాంకులు అందిస్తున్నాయి . ఈ బ్యాంకుల వెబ్సైట్ కి వెళ్లి అటల్ పెన్షన్ ఎకౌంటు తెరవచ్చు. ఆన్‌లైన్ గాని, బ్యాంకుల వద్ద అటల్ పెన్షన్ దరఖాస్తు ఫామ్ లు అందుబాటులో ఉన్నాయి. వీటిని డౌన్ లోడ్ చేసుకొని అవసరమైన సమాచారం అంతా నింపాలి.
దరఖాస్తు ఫారములు నింపిన తర్వాత బ్యాంకు వద్ద ఈ ఫారమ్ ను అందజేయాలి. వ్యాలీడ్ మొబైల్ నెంబర్ తో పాటు ఆధార్ కార్డు ఫోటోగ్రఫీని కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అప్లికేషన్ అప్రూవల్ అయిన తర్వాత మీకు కన్ఫర్మేషన్ మెసేజ్ కూడా వస్తుంది.
1000 రూపాయల పెన్షన్ రావాలంటే నెలకు 42 రూపాయల కంట్రీబూట్ చేయాల్సి ఉంటుంది. ఇలా 5000 రూపాయల పెన్షన్ కోసం నెలకు 210 రూపాయల కంట్రీబుక్ చేయాల్సి ఉంటుంది.
అదే త్రైమాసికంగా 626 రూపాయలు, అర్ధవార్షికంగా 1239, రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. నామినీకి ఏక మొత్తంలో 8.5 లక్షల రూపాయలు చెల్లిస్తారు. ఈ రకంగా భార్యాభర్తలు 10 వేల రూపాయల పెన్షన్ పొద్దే అవకాశం ఉంటుంది.