Nizamabad : నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. RTC బస్సును ఢీకొన్న లారీ..!
నిజామాబాద్ జిల్లా జక్రాంపల్లి మండల పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.మండలంలోని ఆర్గుల్ గ్రామం వద్ద నిలిపి ఉంచిన ఆర్టీసీ హైర్ బస్సును వెనుక నుండి ఒక లారీ అతివేగంగా వచ్చి ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

Nizamabad : నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. RTC బస్సును ఢీకొన్న లారీ..!
ఆర్మూర్, మన సాక్షి:
నిజామాబాద్ జిల్లా జక్రాంపల్లి మండల పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.మండలంలోని ఆర్గుల్ గ్రామం వద్ద నిలిపి ఉంచిన ఆర్టీసీ హైర్ బస్సును వెనుక నుండి ఒక లారీ అతివేగంగా వచ్చి ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
స్థానికులు మరియు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్టీసీ హైర్ బస్సు కామారెడ్డి నుండి ఆర్మూర్ వైపు వెళ్తోంది.ఈ క్రమంలో ఆర్గుల్ గ్రామం వద్దకు చేరుకోగానే,కొంతమంది ప్రయాణికులను దింపడం కోసం డ్రైవర్ బస్సును రోడ్డు పక్కన ఆపారు. సరిగ్గా అదే సమయంలో వెనుక నుండి వేగంగా వచ్చిన ఒక లారీ, అదుపు తప్పి ఆగి ఉన్న బస్సును బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాద ధాటికి బస్సు వెనుక భాగం పూర్తిగా దెబ్బతినడమే కాకుండా, లోపల ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా ఎగిరి పడటంతో 11 మందికి రక్తం గారేలా గాయాలయ్యాయి.ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి గాయపడిన వారిని బయటకు తీశారు.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని 108 అంబులెన్స్‌లో క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.ప్రమాద విషయం తెలుసుకున్న నిజామాబాద్ పోలీస్ కమిషనర్ (CP) సాయి చైతన్య వెంటనే ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి, వారికి అందుతున్న వైద్య సేవలను డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
అతివేగం , అజాగ్రత్తే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
MOST READ :
- Snakes : చూపు మందగించినా గురి తప్పని దాడి.. పాములకు ఆ అద్భుత శక్తులు ఏంటో తెలుసా..?
- Pink Coffee : పింక్ కాఫీ మహిళల పాలిట సంజీవని.. ఈ రంగు కాఫీలో దాగున్న ఆరోగ్య రహస్యాలు ఇవే..!
- TG News : రైతులకు గుడ్ న్యూస్.. వారికి ఎకరానికి రూ. 50వేల రాయితీ..!
- Miryalaguda : యాదాద్రి పవర్ ప్లాంట్ లో ఉద్యోగాలు ఇప్పిస్తానని భారీ మోసం.. బాధితుల ఆందోళన..!










