Snakes : చూపు మందగించినా గురి తప్పని దాడి.. పాములకు ఆ అద్భుత శక్తులు ఏంటో తెలుసా..?
భూమిపై అత్యంత భయంకరమైన జీవులుగా పేరున్న పాముల గురించి మనకు తెలియని ఆసక్తికరమైన విషయాలు చాలా ఉన్నాయి. సాధారణంగా పాములకు తీక్షణమైన కంటిచూపు ఉంటుందని అందరూ భావిస్తారు, కానీ వాస్తవానికి పాములకు దృష్టి సామర్థ్యం చాలా తక్కువ. ఇవి సాధారణంగా 1 నుండి 3 మీటర్ల దూరం వరకు మాత్రమే స్పష్టంగా చూడగలవు.

Snakes : చూపు మందగించినా గురి తప్పని దాడి.. పాములకు ఆ అద్భుత శక్తులు ఏంటో తెలుసా..?
మన సాక్షి, ఫీచర్స్ :
భూమిపై అత్యంత భయంకరమైన జీవులుగా పేరున్న పాముల గురించి మనకు తెలియని ఆసక్తికరమైన విషయాలు చాలా ఉన్నాయి. సాధారణంగా పాములకు తీక్షణమైన కంటిచూపు ఉంటుందని అందరూ భావిస్తారు, కానీ వాస్తవానికి పాములకు దృష్టి సామర్థ్యం చాలా తక్కువ. ఇవి సాధారణంగా 1 నుండి 3 మీటర్ల దూరం వరకు మాత్రమే స్పష్టంగా చూడగలవు. కింగ్ కోబ్రా వంటి పెద్ద జాతులు మాత్రమే 10 నుండి 15 మీటర్ల వరకు చూడగలవు. అయినప్పటికీ ఇవి వేటలో అత్యంత విజయవంతమైన జీవులుగా నిలుస్తున్నాయి. చూపు మందగించినా ఇతర ఇంద్రియాల ద్వారా ఇవి తమ ఎరను ఇట్టే పట్టేస్తాయి.
నాలుక కంపనాల ద్వారా శత్రువు గుర్తింపు
కంటిచూపు తక్కువగా ఉన్నప్పటికీ పాములు వాసన కంపనాల ద్వారా పరిసరాలను అంచనా వేస్తాయి. పాము పదే పదే తన నాలుకను బయటకు చాచడం వెనుక ఒక ప్రధాన కారణం ఉంది. గాలిలోని అణువులను తన నాలుక ద్వారా గ్రహించి ఎర ఎక్కడ ఉందో వాసన ద్వారా పసిగడుతుంది. అలాగే పాములకు బయటకు కనిపించే చెవులు ఉండవు, కానీ భూమిలో కలిగే అతి స్వల్ప కంపనాలను తన చర్మం ద్వారా గ్రహిస్తాయి. మనుషులు లేదా ఇతర జీవులు దరిదాపుల్లోకి వస్తే ఆ ప్రకంపనల ద్వారానే అవి అప్రమత్తమవుతాయి. మన అడుగుల శబ్దాన్ని అవి తమ శరీరం ద్వారా వినగలవు.
హీట్ సెన్సార్లు థర్మల్ విజన్
కొండచిలువలు పిట్ వైపర్లు వంటి కొన్ని రకాల పాములకు తల భాగంలో ప్రత్యేకమైన హీట్ సెన్సార్లు ఉంటాయి. ఇవి చీకటిలో కూడా ఇతర జీవుల శరీరం నుండి వెలువడే ఉష్ణోగ్రతను గుర్తించగలవు. కళ్లు కనిపించకపోయినా ఈ ‘థర్మల్ విజన్’ సాయంతో రాత్రిపూట కూడా పాములు ఖచ్చితత్వంతో దాడి చేయగలవు. మొత్తానికి పాములు చూపుపై కంటే వాసన, కంపనాలు ఉష్ణోగ్రతను గుర్తించే శక్తులపైనే ఎక్కువగా ఆధారపడి వేటాడతాయి. అందుకే పొలాల్లో లేదా అడవుల్లో నడిచేటప్పుడు శబ్దం చేస్తూ నడిస్తే ఆ కంపనాలకు పాములు దూరంగా వెళ్లిపోతాయని నిపుణులు సూచిస్తుంటారు.
By : Vishal, Sr. Journalist, Hyderabad
MOST READ :









