AC : కూలర్ నుంచి ఏసీ గాలి.. ఈ చిన్న ట్రిక్స్ పాటిస్తే చాలు..!
వేసవిలో ఎండలు మండిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాలలో మరింతగా ఎండలు మండిపోతున్నాయి. మధ్యాహ్నమే కాకుండా ఉదయం వేళలో కూడా బయటకు వెళ్లాలంటే వెళ్లలేని పరిస్థితి నెలకొన్నది.

AC : కూలర్ నుంచి ఏసీ గాలి.. ఈ చిన్న ట్రిక్స్ పాటిస్తే చాలు..!
మన సాక్షి, ఫీచర్స్ :
వేసవిలో ఎండలు మండిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాలలో మరింతగా ఎండలు మండిపోతున్నాయి. మధ్యాహ్నమే కాకుండా ఉదయం వేళలో కూడా బయటకు వెళ్లాలంటే వెళ్లలేని పరిస్థితి నెలకొన్నది. ఇంట్లో ఉన్నా కూడా కూలర్ ఫ్యాన్ గాలి వేడిగా వస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. దాంతో కూలర్ గాలిని ఏసి మాదిరిగా చల్లదనం రావాలంటే చిన్న చిన్న ట్రిక్స్ పాటిస్తే సరిపోతుంది. అవి ఏంటో తెలుసుకుందాం..
1. కూలర్ ను గదిలో కాకుండా గది బయట గాలి తీసుకునే విధంగా కిటికీ దగ్గర అమర్చే విధంగా చూసుకోవాలి.
2. అదేవిధంగా కూలర్ లో పోసే నీరు వేడిగా ఉండకూడదు. చల్లటి నీటిని పోయాలి.
3. అవసరమైతే ఆ నీటిలో ఐస్ క్యూబ్స్ కూడా వేస్తే ఇంకా చలదనం ఎక్కువగా ఉంటుంది.
4. ఏసీ గాలి మాదిరిగా రావాలంటే కూలర్ వేసిన తర్వాత గది మొత్తం చల్లదనం రావడానికి సీలింగ్ ఫ్యాన్ కూడా తక్కువలో తిరుగుతుంటే బాగుంటుంది.
5. అదేవిధంగా గదిలోకి బయటి గాలి వచ్చే విధంగా గదిలో నుంచి బయటికి గాలి వెళ్లే విధంగా వెలుతురు ఉంచాలి.
6. కిటికీలు, తలుపులు మూసి వేయకూడదు.
7. కూలర్ తడకలను ప్రతి సంవత్సరం మార్చుతూ ఉండాలి. పాత తడకలు ఉండటం వల్ల నీటిని తీసుకోక చల్లదనం రాకుండా పోతుంది.
8. గదిలో ఎక్కువ ఓల్టేజ్ లైట్లు, ఇతర వస్తువులను వాడకూడదు.
9. కూలర్ ట్యాంకర్ కూడా అప్పుడప్పుడు శుభ్రం చేసుకోవడంతో పాటు శుభ్రమైన నీటిని వినియోగించాలి.
10. ఇలా చేస్తే కూలర్ కూడా ఏసీ ని తలపించే విధంగా చల్లదనం వస్తుంది.









