Phonepe : ఫేక్ ఫోన్ పే మోసం.. రూ.20 వేలు క్యాష్ ట్రాన్స్ ఫర్..!
అత్యవసరంగా డబ్బులు అవసరం ఉన్నాయని ఓ వ్యక్తి ఫేక్ ఫోన్ పే ద్వారా డబ్బులు బదిలీ చేసినట్లుగా చూపించి ఉడాయించిన ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.

Phonepe : ఫేక్ ఫోన్ పే మోసం.. రూ.20 వేలు క్యాష్ ట్రాన్స్ ఫర్..!
మన సాక్షి, హైదరాబాద్ :
అత్యవసరంగా డబ్బులు అవసరం ఉన్నాయని ఓ వ్యక్తి ఫేక్ ఫోన్ పే ద్వారా డబ్బులు బదిలీ చేసినట్లుగా చూపించి ఉడాయించిన ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. హైదరాబాదులోని మొగల్ పురాకు చెందిన వహీం అహ్మద్ ఖాన్ ఈనెల 20వ తేదీన టోలిచౌకిలోని తన అమ్మమ్మ ఇంటికి వచ్చాడు. ఆ తర్వాత డబ్బులు అవసరం ఉండగా షేక్ పేటలోని కరాచీ బేకరీ సమీపంలో ఉన్న ఏటీఎం వద్దకు వెళ్లాడు.
ఆ సమయంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి కారులో వచ్చి తనకు అర్జెంటుగా 20 వేల రూపాయలు అవసరం ఉన్నాయని తన కుటుంబం ఎదురుచూస్తుందని, ఫోన్ పే చేస్తానని చెప్పి అతని నమ్మించాడు. దాంతో అతడు నమ్మి 20 వేల రూపాయలు ఇచ్చాడు. ఆ తర్వాత సదరు వ్యక్తి ఫేక్ ఫోన్ పే ద్వారా వహీం నెంబర్ ఎంటర్ చేసి నగదు బదిలీ చేసిన్నట్లుగా చూపించి వెళ్లిపోయాడు. ఆ తర్వాత అకౌంట్ లోకి డబ్బులు రాకపోవడంతో అతను ఫిల్మినగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.
సీసీ కెమెరాలు ఆధారంగా పోలీసులు నిందితున్ని బండ్లగూడ ఫర్హాన్ కాలనీ, చంద్రాయన గుట్టకు చెందిన మహమ్మద్ ముక్తదర్ రెహమాన్, మహమ్మద్ అఖిఫ్ గా గుర్తించి అరెస్టు చేశారు.









