Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsజాతీయం

PhonePe : ఫోన్ పే లో సరికొత్త ఫీచర్.. చెల్లింపులు మరింత ఈజీ.. లేటెస్ట్ అప్డేట్..!

డిజిటల్ చెల్లింపులకే ప్రజలు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఐదు రూపాయల నుంచి లక్షల రూపాయల వరకు కూడా డిజిటల్ చెల్లింపులకు ప్రాధాన్యత ఇస్తున్నారు.

PhonePe : ఫోన్ పే లో సరికొత్త ఫీచర్.. చెల్లింపులు మరింత ఈజీ.. లేటెస్ట్ అప్డేట్..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

డిజిటల్ చెల్లింపులకే ప్రజలు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఐదు రూపాయల నుంచి లక్షల రూపాయల వరకు కూడా డిజిటల్ చెల్లింపులకు ప్రాధాన్యత ఇస్తున్నారు. చాలామంది బ్యాంకులకు వెళ్లడం, ఏటీఎం సెంటర్లకు వెళ్ళటం కూడా మానేశారు. వినియోగదారుల భద్రత దృష్టిలో ఉంచుకొని ఫోన్ పే ఫిన్ టెక్ సంస్థ సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. డిజిటల్ చెల్లింపులను వినియోగదారులకు మరింత స్మార్ట్ గా మారుస్తూ ఏఐ ఆధారిత నేచురల్ లాంగ్వేజ్ సెర్చ్ ఫీచర్ ని ప్రారంభించింది.

ఈ వినూతన ఫీచర్ ను మైక్రోసాఫ్ట్ ఫౌండ్రీ భాగస్వామ్యంతో అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనివల్ల కష్ణమైన మెనూలను వెతకాల్సిన అవసరం లేదు. కేవలం వాయిస్, టెక్స్ట్ కమాండ్స్ తో లావాదేవీలను పూర్తి చేయవచ్చును. ఇది అన్ డివైస్ క్లౌడ్ ఆధారంగా పనిచేసే హైబ్రిడ్ మోడల్ అని, వినియోగదారుల డేటా భద్రతకు కూడా ఎటువంటి ముప్పు లేకుండా సురక్షితంగా చెల్లింపులు చేయవచ్చునని ఫోన్ పే వ్యవస్థాపకులు రాహుల్ చారి పేర్కొన్నారు.

Related News:

మరిన్ని వార్తలు