Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsతెలంగాణ

TG News : తెలంగాణలో వారికి గుడ్ న్యూస్.. త్వరలో పింఛన్లు.!

తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ తెలియజేసింది. త్వరలో కార్మికులకు కూడా పింఛన్లు అందజేయనున్నట్లు ప్రకటించింది.

TG News : తెలంగాణలో వారికి గుడ్ న్యూస్.. త్వరలో పింఛన్లు.!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ తెలియజేసింది. త్వరలో కార్మికులకు కూడా పింఛన్లు అందజేయనున్నట్లు ప్రకటించింది. సిద్దిపేట జిల్లాలో కార్మికులతో నిర్వహించిన సమావేశంలో ఆ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి వెల్లడించారు. కార్మికులు ఎంతో కాలంగా చేస్తున్న డిమాండ్ వల్ల వారికి కూడా పింఛన్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కార్మికుల పక్షాన పని చేస్తుందని, వారికి గుర్తింపు కార్డులు త్వరలో ప్రతి ఒక్కరికి అందజేస్తామన్నారు.

దాంతోపాటు కార్మిక శాఖ గుర్తింపు కార్డులు ఉన్న వారందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు, బీమా సదుపాయం కల్పిస్తామని తెలిపారు. బీమా సదుపాయం కూడా 10 లక్షల రూపాయల వరకు పెంచిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. లేబర్ ఆఫీసులను కూడా బలోపేతం చేయనున్నట్లు తెలిపారు.

MOST READ : 

మరిన్ని వార్తలు