TG News : తెలంగాణలో నేడు బిగ్ డే.. ఒకే రోజు రేవంత్, కెసిఆర్ బహిరంగ సభలు..!
వేసవి ఎండలు మండుతున్నాయి. అదేవిధంగా తెలంగాణలో రాజకీయం కూడా మండుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాల కాలంలోనే ఆ పార్టీ నుంచి నాయకులు బిఆర్ఎస్ లోకి చేరడంతో రాజకీయం రంజుగా మారింది.

TG News : తెలంగాణలో నేడు బిగ్ డే.. ఒకే రోజు రేవంత్, కెసిఆర్ బహిరంగ సభలు..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
వేసవి ఎండలు మండుతున్నాయి. అదేవిధంగా తెలంగాణలో రాజకీయం కూడా మండుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాల కాలంలోనే ఆ పార్టీ నుంచి నాయకులు బిఆర్ఎస్ లోకి చేరడంతో రాజకీయం రంజుగా మారింది.
సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ మంత్రి జీవన్ రెడ్డి అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రతిపక్ష బిఆర్ఎస్ లో చేరటం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈనెల 20వ తేదీన జగిత్యాలలో భారీ బహిరంగ సభ ద్వారా ఆయన బిఆర్ఎస్ లో చేరనున్నారు. ఈ సభకు మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ హాజరుకానున్నారు. ఏడాది కాలం తర్వాత కేసీఆర్ బహిరంగ సభలో పాల్గొనడంతో ఆయన ప్రసంగం కోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఎదురుచూస్తున్నారు.
కేసీఆర్ దెబ్బకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అతలాకుతలం అవుతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతుంది. దాంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇదే రోజు 20వ తేదీన భూపాలపల్లి జిల్లా కాటారంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో రైతు భరోసా రెండవ విడత నిధులను కూడా ఆయన విడుదల చేయనున్నారు. ఇరువురు కూడా ఒకేరోజు బహిరంగ సభలు నిర్వహించడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
ఈ బహిరంగ సభతో రాజకీయాలు జోరందుకోనున్నాయి. బహిరంగ సభ అనంతరం కేసీఆర్ ప్రత్యక్షంగా రాజకీయాల్లో ఉంటారా..? తిరిగి ఫామ్ హౌస్ లో ఉంటూ రాజకీయాలు చేస్తారా..? అనే విషయం తెలియాల్సి ఉంది. కేసీఆర్ ఏ అంశాలపై మాట్లాడుతారనే విషయం రాష్ట్రవ్యాప్తంగా ఎదురుచూస్తున్నారు. ఏదేమైనా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అధికార ప్రతిపక్ష నేతలు బహిరంగ సభలు ఒకేరోజు నిర్వహించడం బిగ్ డేగ భావిస్తున్నారు.