Nalgonda : నల్గొండ జిల్లా దేవరకొండ SBIలో రూ.2.65 కోట్ల భారీ మోసం.. నలుగురు అరెస్టు..!
నల్గొండ జిల్లా దేవరకొండ టౌన్ పరిధిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏసీబీ అగ్రికల్చరల్ కమర్షియల్ బ్రాంచ్ లో జరిగిన భారీ ఆర్థిక మోసం కేసును దేవరకొండ పోలీసులు సమర్థవంతంగా ఛేదించి, ఈ కేసులో ప్రధాన నిందితుడితో పాటు సహ నిందితులను అరెస్ట్ చేసి భారీ మొత్తంలో నగదు మరియు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ శరత్చంద్ర పవర్ తెలిపారు.

Nalgonda : నల్గొండ జిల్లా దేవరకొండ SBIలో రూ.2.65 కోట్ల భారీ మోసం.. నలుగురు అరెస్టు..!
రెండు కోట్ల 42 లక్షల పదివేల రూపాయల నగదు 06 స్మార్ట్ మొబైల్ ఫోన్లు, 01 ల్యాప్టాప్ స్వాధీనం.
జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెల్లడి
నల్లగొండ, మన సాక్షి :
నల్గొండ జిల్లా దేవరకొండ టౌన్ పరిధిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏసీబీ అగ్రికల్చరల్ కమర్షియల్ బ్రాంచ్ లో జరిగిన భారీ ఆర్థిక మోసం కేసును దేవరకొండ పోలీసులు సమర్థవంతంగా ఛేదించి, ఈ కేసులో ప్రధాన నిందితుడితో పాటు సహ నిందితులను అరెస్ట్ చేసి భారీ మొత్తంలో నగదు మరియు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ శరత్చంద్ర పవర్ తెలిపారు. మంగళవారం ఎస్పీ తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ..
ఈనెల 13న న దేవరకొండ బ్రాంచ్ మేనేజర్ ఫణీంద్ర నీలకంఠ వెంకట రాఘవపూడి దేవరకొండ పోలీస్ స్టేషన్ కు వచ్చి, తమ బ్యాంక్ లో కాంట్రాక్ట్ బేసిక్ హౌస్ కీపింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న లెండల చక్రపాణి అనే వ్యక్తి బ్యాంక్ లోని ఇనాక్టివ్ ఖాతాల వివరాలను దుర్వినియోగం చేసి, నాన్-బ్రాంచ్ కేవైసీ అప్డేట్ ప్రక్రియను అక్రమంగా ఉపయోగించి, ఆ ఖాతాల నుండి మొత్తం రూ.2,65,55,268/- (రెండు కోట్ల అరవై ఐదు లక్షల యాభై ఐదు వేల రెండు వందల అరవై ఎనిమిది రూపాయలు) నగదును మోసపూరితంగా బదిలీ చేసినట్లు పిర్యాదు చేసినట్లు ఎస్పీ తెలిపారు
దీనిపై దేవరకొండ పోలీస్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించనట్లు చెప్పారు
ఈ కేసును దేవరకొండ డీఎస్పీ ఎం.వి. శ్రీనివాస రావు పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసి, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పీ. వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది సమన్వయంతో సాంకేతిక శాస్త్రీయ ఆధారాలను సేకరించి, వివిధ ప్రాంతాల్లో దర్యాప్తు చేపట్టి నిందితులను చాకచక్యంగా అదుపులోకి తీసుకోవడం జరిగిందని తెలిపారు లెండల చక్రపాణి, దేవరకొండ ఎస్బిఐబ్యాంక్ మేనేజర్, సూర్యాపేట బ్రాంచ్
.కేతవత్ రాంలాల్, మిర్యాలగూడ టౌన్.
4.మారేపల్లి శివ, గణేశ్ నగర్, దేవరకొండ నిందితులని వీరిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు
నేరం ఎలా చేశారంటే :
నిందితుడు లెండల చక్రపాణి, గత 5 సంవత్సరాలుగా ఎస్బిఐ బ్యాంక్ లో కాంట్రాక్ట్ హౌస్ కీపింగ్ ఉద్యోగిగా పనిచేస్తూ, కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండటం వలన బ్యాంక్ సిబ్బందికి కంప్యూటర్ పనుల్లో సహాయం చేసేవాడు. ఈ విధంగా అతనికి బ్యాంక్ లోని అంతర్గత వ్యవస్థలు మరియు ఖాతాల నిర్వహణ విధానాలపై అవగాహన ఏర్పడింది.
అతనికి సూర్యపేట మెయిన్ బ్రాంచ్ లో పనిచేసే బ్యాంక్ మేనేజర్ పుట్ట వెంకట రామాంజనేయులు తో పరిచయం ఏర్పడింది. కుటుంబ ఆర్థిక ఇబ్బందులు మరియు అప్పుల కారణంగా అక్రమంగా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్న చక్రపాణి, రామాంజనేయులు తో కలిసి ఈ మోసానికి ప్రణాళిక రూపొందించాడు. రామాంజనేయులు తన అధికార పరిధిలో ఉన్న ఎం ఐ ఎస్ ద్వారా గత కొన్ని సంవత్సరాలుగా ఎటువంటి ట్రాన్సాక్షన్ లు జరగని డబ్బులు ఉన్న 10 ఇనాక్టివ్ బ్యాంక్ ఖాతాల వివరాలను సేకరించాడు.
తదుపరి ఆ ఖాతాదారుల పేరు, చిరునామా, ఆధార్, పాన్ ఫోటో సంతకం వివరాలను సేకరించి, రేఖ ప్రింట్ ఇన్ఫ్రా సైట్ ఆధారంగా నకిలీ ఆధార్ పాన్ కార్డులను తయారు చేశారు.బ్యాంక్ ఉద్యోగుల లాగిన్ వివరాలను గమనించి, రద్దీ సమయాల్లో కంప్యూటర్ లోకి లాగిన్ అయి, ఖాతాలకు కొత్త మొబైల్ నంబర్ అప్డేట్ చేశారు. అనంతరం యోనో యాప్ ద్వారా కొత్త యూజర్ ఐడి పాస్వర్డ్ పిన్ను సృష్టించారు.
ఆ ఖాతాల నుండి నగదును ఇతర వ్యక్తుల ఖాతాలకు ఆన్లైన్ ద్వారా బదిలీ చేశారు.
తదుపరి, నిందితులు రాంలాల్ శివ తమ పరిచయస్తుల ద్వారా వారికి తెలిసిన వ్యక్తుల నుండి “మీ అకౌంట్ లోకి డబ్బులు వస్తాయి, మీరు నగదు ఇవ్వండి — ఇది లీగల్ ట్రాన్సాక్షన్” అని నమ్మబలికి, కమిషన్ ఆశ చూపించి వారి బ్యాంక్ ఖాతా వివరాలను సేకరించారు.ఈ విధంగా అక్రమంగా సంపాదించిన మొత్తాన్ని45% లెండల చక్రపాణి, పుట్ట వెంకట రామాంజనేయులు,10% కేతవత్ రాంలాల్ మరియు మారేపల్లి శివ వాటాలుగా పంచుకునే విధంగా ముందుగానే నిర్ణయించుకున్నారు.
ఈ మోసం వెలుగులోకి రావడానికి కారణం, పల్లటి నరేందర్ అనే ఖాతాదారునికి చెందిన బ్యాంకులో కోటి, హైదరాబాద్ బ్రాంచ్ ఖాతాలో అక్రమంగా కేవైసీ అప్డేట్ చేయబడినప్పుడు, అతనికి ఇ-మెయిల్ ద్వారా అలర్ట్ మెసేజ్ వెళ్లింగా వెంటనే బ్యాంక్ ను సంప్రదించడంతో అసలు విషయం బయటపడింది. కేసును డియస్పీ దేవరకొండ ఆద్వర్యంలోవెంకట్ రెడ్డి, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్,పర్యవేక్షంనలొ రాజు, సబ్ ఇన్స్పెక్టర్, దేవరకొండ,కానిస్టేబుల్స్ వీరబాబు, పోలీస్ కానిస్టేబుల్ ఫయాజ్, . చాంద్ పాషా,వి. సింహాద్రి, హోం గార్డ్,సోమ్లా, హోం గార్డ్ (డ్రైవర్)లను సమర్థవంతంగా ఛేదించి నిందితులను అరెస్ట్ చేసినందుకు జిల్లా ఎస్పీ అబినందించారు.
ఇవి కూడ చదవండి :
- Karimnagar : పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడి..17 మంది అరెస్ట్, రూ.6.74 లక్షలు స్వాధీనం..!
- District Collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు.. ఇతర రాష్ట్రాల ధాన్యం రాకుండా పటిష్ట చర్యలు..!
- TG News : తెలంగాణలో నేడు బిగ్ డే.. ఒకే రోజు రేవంత్, కెసిఆర్ బహిరంగ సభలు..!
- Suryapet : 37 ఏళ్ల స్నేహబంధం.. అపూర్వ కలయిక, ఆనంద హేళ..!










