Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
రాజకీయంBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Miryalaguda : హైకోర్టు తీర్పు కాంగ్రెస్ కుట్రలకు చెంపపెట్టు..!

కాళేశ్వరం పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ పార్టీ కుట్రలకు చెంపపెట్టు అని మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు అన్నారు.

Miryalaguda : హైకోర్టు తీర్పు కాంగ్రెస్ కుట్రలకు చెంపపెట్టు..!

మిర్యాలగూడ, మన సాక్షి :

కాళేశ్వరం పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ పార్టీ కుట్రలకు చెంపపెట్టు అని మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు అన్నారు. మిర్యాలగూడ లోని బీఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహ రెడ్డితో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు రాజకీయ లాభాల కోసం అసత్యాలను ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

హైకోర్టు స్పష్టమైన తీర్పుతో కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు, దుష్ప్రచారాలు బయటపడ్డాయని ఆయన పేర్కొన్నారు. నిజం ఎప్పటికైనా గెలుస్తుందని, న్యాయం నిలుస్తుందని ఈ తీర్పు మరోసారి నిరూపించిందన్నారు. ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ, ఇలాంటి కుట్రలతో తిరిగి ప్రాధాన్యం సంపాదించాలని చూస్తోందని ఆయన ఆరోపించారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను చూసి భయపడుతున్న కాంగ్రెస్ నాయకులు, రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుడు ఆరోపణలు చేస్తూ రాష్ట్రాన్ని అస్థిరపరచాలని ప్రయత్నిస్తున్నారని భాస్కర్ రావు ఘాటుగా విమర్శించారు. కానీ ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని, సరైన సమయంలో తగిన తీర్పు ఇస్తారని ఆయన అన్నారు.

ఇకపై కాంగ్రెస్ పార్టీ నేతలు ఇలాంటి అసత్య ప్రచారాలను నిలిపివేసి ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాలని హెచ్చరించారు. లేకపోతే ప్రజల నుంచి గట్టి ప్రతిస్పందన ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, చిట్టిబాబు నాయక్, మోసిన్ అలీ, దైద సత్యం, మాజీద్ తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు