Breaking Newsక్రైంజిల్లా వార్తలుహైదరాబాద్
Accident : రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి..!
హైదరాబాద్ కూకట్పల్లి మెట్రో స్టేషన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఆదివారం ఉదయం ఈ సంఘటన చోటుచేసుకుంది.

Accident : రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి..!
మన సాక్షి, కూకట్పల్లి :
హైదరాబాద్ కూకట్పల్లి మెట్రో స్టేషన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఆదివారం ఉదయం ఈ సంఘటన చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ఆదివారం సెలవు రోజు కావడంతో స్నేహితులతో కలిసి బైక్ పై క్రికెట్ ఆడేందుకు వెళ్తున్న వారిని లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మహేష్ (17) లక్ష్మీ తేజ్ (17) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన మరొకరిని అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.









