Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలునల్గొండ

Nalgonda : చెరువుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్ధం..!

నల్గొండ జిల్లాలోని నార్కట్ పల్లి మండలం ప్రముఖ పుణ్యక్షేత్రం చెరువుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి గుట్ట కింద శనివారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

Nalgonda : చెరువుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్ధం..!

మన సాక్షి, నల్గొండ ప్రతినిధి :

నల్గొండ జిల్లాలోని నార్కట్ పల్లి మండలం ప్రముఖ పుణ్యక్షేత్రం చెరువుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి గుట్ట కింద శనివారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 17 వ్యాపార దుకాణాలు, 15 తోపుడు బండ్లు అగ్నికి ఆహుతి అయ్యాయి.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ బొమ్మల దుకాణంలో మంటలు ప్రారంభమై గాలి దాటికి క్షణాల్లోనే పక్కనున్న షాపులన్నింటికీ వ్యాపించాయి. దాంతో 17 వ్యాపార దుకాణాలు, 15 తోపుడు బండ్లు దగ్ధమయ్యాయి. మంటల తీవ్రతకు దుకాణాలలో ఉన్న గ్యాస్ సిలిండర్లు పేలడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

ఈ క్రమంలోనే గ్రామపంచాయతీ ఆఫీసులో ఉన్న ముఖ్యమైన రికార్డులు కూడా దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో సుమారుగా 2.5 కోట్ల మేర ఆస్తి నష్టం వాటిలినట్లుగా స్థానిక సర్పంచ్ పేర్కొన్నారు.

అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మూడు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదం అర్ధరాత్రి వేళ జరగడంతో దుకాణాలలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. ప్రమాదానికి కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు