Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఆంధ్రప్రదేశ్క్రైం

Breaking : గొర్రెలమందపై కుక్కలు దాడి.. 40 గొర్రెలు మృతి..!

అన్నమయ్య జిల్లా మండలం ఊలపాడు గ్రామంలో శుక్రవారం రాత్రి విషాద ఘటన చోటుచేసుకుంది. బుసానికురప్ప ల్లి గ్రామానికి చెందిన బాతిన్న గారి చంద్రప్పకు చెందిన గొర్రెల షెడ్డుపై కుక్కలు దాడి చేయడంతో 40 గొర్రెలు మృతి చెందాయి.

Breaking : గొర్రెలమందపై కుక్కలు దాడి.. 40 గొర్రెలు మృతి..!

రామసముద్రం, మనసాక్షి:

అన్నమయ్య జిల్లా మండలం ఊలపాడు గ్రామంలో శుక్రవారం రాత్రి విషాద ఘటన చోటుచేసుకుంది. బుసానికురప్ప ల్లి గ్రామానికి చెందిన బాతిన్న గారి చంద్రప్పకు చెందిన గొర్రెల షెడ్డుపై కుక్కలు దాడి చేయడంతో 40 గొర్రెలు మృతి చెందాయి. ఈ ఘటనతో ఆయనకు దాదాపు రూ.3.5 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపారు. గొర్రెలను మేపుకుంటూ జీవనం సాగిస్తున్న చంద్రప్ప ఒక్కసారిగా జరిగిన ఈ ఘటనతో తీవ్ర ఆవేదనకు గురయ్యారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి కుక్కల బెడద నుండి రక్షణ కల్పించాలని, నష్టపరిహారం అందించాలని ఆయన వాపోయారు.

MOST READ : 

మరిన్ని వార్తలు