Karimnagar : రేకుర్తి సీసీ రోడ్డు పనులను వెంటనే ప్రారంభించాలి.. మేయర్‌కు స్థానికుల వినతి.!
కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని రేకుర్తి 20వ డివిజన్‌కు చెందిన పలు కాలనీల ప్రజలు, నాయకులు తమ ప్రాంతంలో నిలిచిపోయిన సీసీ రోడ్డు పనులను వెంటనే ప్రారంభించాలని కోరుతూ బుధవారం నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ కు వినతిపత్రం అందజేశారు.

Karimnagar : రేకుర్తి సీసీ రోడ్డు పనులను వెంటనే ప్రారంభించాలి.. మేయర్‌కు స్థానికుల వినతి.!
కరీంనగర్, జూలై 29, మనసాక్షి :
కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని రేకుర్తి 20వ డివిజన్‌కు చెందిన పలు కాలనీల ప్రజలు, నాయకులు తమ ప్రాంతంలో నిలిచిపోయిన సీసీ రోడ్డు పనులను వెంటనే ప్రారంభించాలని కోరుతూ బుధవారం నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బి.ఆర్.ఎస్ నాయకులు ఎండి సైఫుద్దీన్ మాట్లాడుతూ రేకుర్తి స్టేజ్ నుండి స్వామి కాలనీ (ఎస్.ఆర్.ఎస్పీ కెనాల్) వరకు సీసీ రోడ్డు నిర్మాణానికి గతంలోనే నిధులు మంజూరై, అధికారికంగా శంకుస్థాపన కూడా పూర్తయిందని తెలిపారు.
అయితే శంకుస్థాపన జరిగి ఇన్నాళ్లవుతున్నా ఇప్పటివరకు ఎలాంటి పనులు ప్రారంభం కాకపోవడంపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ రోడ్డు పూర్తిగా గుంతలమయంగా మారి, కనీసం నడవడానికి కూడా వీల్లేకుండా తయారైందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలోనే ప్రసిద్ధ సమ్మక్క-సారలమ్మ గద్దెలతో పాటు, శ్రీ లక్ష్మి నరసింహ స్వామి గుట్ట దేవాలయం కూడా ఉన్నాయని పేర్కొన్నారు.
ఇక్కడికి నిత్యం వచ్చే భక్తులతో పాటు, రెండేళ్లకోసారి మినీ మేడారంగా జరిగే సమ్మక్క జాతరకు వేలాదిగా తరలివచ్చే భక్తులు సరైన రోడ్డు సదుపాయం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. గుంతల రోడ్డు వల్ల స్థానిక కాలనీల ప్రజలు, వాహనదారులు నిత్యం ప్రమాదాల బారిన పడుతున్నారని తెలిపారు.
ఇకనైనా ఆలస్యం చేయకుండా కాంట్రాక్టర్ లేదా సంబంధిత అధికారులను ఆదేశించి, వెంటనే సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమయ్యేలా చూడాలని ఎస్ఎస్ హిల్స్, లక్ష్మినగర్, శేఖబి కాలనీ, సింహాద్రి కాలనీ మరియు స్వామి కాలనీల నివాసితులు మేయర్‌ను కోరారు. ఈ కార్యక్రమంలో ఆయా కాలనీల ప్రతినిధులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.









