District Collector : జిల్లా కలెక్టర్ కీలక ప్రకటన.. జనగణనపై విస్తృత ప్రచారం చేపట్టాలి..!
జనగణన - 2027 - స్వీయ లెక్కింపు ప్రజలకు అందుబాటులో విస్తృత ప్రచారం చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు.

District Collector : జిల్లా కలెక్టర్ కీలక ప్రకటన.. జనగణనపై విస్తృత ప్రచారం చేపట్టాలి..!
నారాయణపేట టౌన్, మనసాక్షి :
జనగణన – 2027 – స్వీయ లెక్కింపు ప్రజలకు అందుబాటులో విస్తృత ప్రచారం చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. జనగణన 2027 కార్యక్రమం లో భాగంగా, మొదటి దశ అయిన గృహ లెక్కింపు, గృహ వసతి గణన మే 11 నుండి 9జూన్ వరకు నిర్వహించబడనుందని ఆయన తెలిపారు. దీనికి ముందు, ప్రజలకు సౌలభ్యం కల్పించేందుకు స్వీయ లెక్కింపు హెచ్టిటిపి:// ఎస్ ఈ. సెన్సస్. జిఓ వి. ఇన్ వెబ్ పోర్టల్ ద్వారా ఈ నెల 26 మే 10వరకు అందుబాటులో ఉంచబడిందని చెప్పారు.
జిల్లా ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని, తమ గృహ కుటుంబ వివరాలను స్వయంగా నమోదు చేసుకోవాలని ఆయన కోరారు.ఇంటి సభ్యుల వివరాలను స్వయంగా నమోదు చేసుకోవడానికి ఇది సులభమైన వేగవంతమైన విధానం అన్నారు.మొబైల్ ఫోన్, కంప్యూటర్ లేదా ఇంటర్నెట్ సౌకర్యం ఉన్న ఏ పరికరం ద్వారానైనా నమోదు చేసుకోవచ్చునని నమోదు పూర్తయిన తర్వాత, ఒక యూనిక్ కోడ్ (అక్నాలెడ్జ్మెంట్) పొందవచ్చు.
దీన్ని తరువాతి గణనాధికారి కి చూపించవ లెననీ తెలిపారు. స్వీయ లెక్కింపులో పాల్గొనడం ద్వారా గణ ప్రక్రియను వేగవంతం చేయడంలో సహకరించిన వారవుతారన్నారు. జిల్లాలోని ప్రజాప్రతిని ధులు, ప్రభుత్వ ఉద్యోగులు, యువత, మహిళా సంఘా లు, స్వయం సహాయక సంఘాలు, బ్యాంకు ఉద్యోగులు, ఐటీ రంగ ఉద్యోగులు మరియు ఇతర వర్గాల వారు ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరారు. జిల్లా ప్రజలందరూ స్వీయ లెక్కింపులో తప్పనిసరిగా పాల్గొని జనగణన-2027 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.









