Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం

Miryalaguda : విదేశీ స్వేచ్ఛ, వాణిజ్య ఒప్పందాలతో దేశీయ వ్యవసాయం దివాలా..!

విదేశీ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలతో దేశీయ వ్యవసాయం దెబ్బతిని రైతాంగం ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారని ఎంసిపిఐ(యు) పొలిట్ బ్యూరో సభ్యులు వల్లెపు ఉపేందర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.

Miryalaguda : విదేశీ స్వేచ్ఛ, వాణిజ్య ఒప్పందాలతో దేశీయ వ్యవసాయం దివాలా..!

రైతు కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆగస్టు 10న జైల్ భరో

ఎంసిపిఐ(యు) రాష్ట్ర కమిటీ సమావేశంలో పొలిట్ బ్యూరో సభ్యులు వల్లెపు ఉపేందర్ రెడ్డి

మిర్యాలగూడ, మన సాక్షి :

విదేశీ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలతో దేశీయ వ్యవసాయం దెబ్బతిని రైతాంగం ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారని ఎంసిపిఐ(యు) పొలిట్ బ్యూరో సభ్యులు వల్లెపు ఉపేందర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రైతు కార్మిక వ్యతిరేక విధానాలను డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఆగస్టు 10న క్విట్ ఇండియా స్ఫూర్తితో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలను వ్యతిరేకిస్తూ రైతు కార్మిక ప్రజా సంఘాలను కలుపుకొని దేశ వ్యాప్తంగా జైల్ భరో ఆందోళన కార్యక్రమాన్ని అన్ని జిల్లాలలో చేపట్టనున్నట్లు తెలిపారు.

ఈరోజు భారత మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ (ఐక్య)- ఎంసిపిఐ(యు) రెండు రోజుల రాష్ట్ర కమిటీ సమావేశాలు నల్గొండ జిల్లా కార్యదర్శి వస్కుల సైదక్క అధ్యక్షతన జరిగాయి. ఈ సమావేశాలకు ముఖ్య అతిథిగా హాజరైన వల్లెపు ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ ఉత్పత్తి ఖర్చులు పెరిగిపోయి ప్రకృతి వైపరీత్యాలతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న దేశీయ రైతాంగానికి స్వేచ్ఛ వానిజ ఒప్పందాలు మరింత ఊబిలోకి నెట్టివేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

దేశంలో రైతాంగం ప్రధానంగా పండించే పత్తి మొక్కజొన్న సోయాబీన్ పాల ఉత్పత్తులు సరైన మార్కెట్ సౌకర్యం లేక పెట్టిన ఖర్చులు రాక ఇబ్బందులు పడుతున్న తరుణంలో అమెరికా లాంటి దేశాల నుంచి ఎలాంటి పన్నులు విధించకుండా స్వేచ్ఛగా దిగుమతి చేసుకోవడం అన్యాయం అన్నారు. అమెరికా లాంటి దేశాల్లో రైతుల పంటలకు సుమారు 60 శాతం పైగా సబ్సిడీలు ఇచ్చి పంటలు పండిస్తున్నారని

ఈ క్రమంలో చౌకగా పంటలను అమ్ముకుంటున్నారని కానీ మనదేశంలో అలాంటి పరిస్థితి లేదని ఈ క్రమంలో ఇతర దేశాల పంటల ఉత్పత్తులకు దేశీయ పంటలకు ధరల వ్యత్యాసం తీవ్రంగా ఉంటున్నదని అందుకని స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలను తక్షణమే ఉపసంహరించుకొని దేశీయ రైతాంగాన్ని వ్యవసాయాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు మరోవైపు కార్మికులకు వ్యవసాయ కూలీలకు హాని కలిగించే విధంగా చట్టాలను రూపొందించి కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరించడం దారుణం అన్నారు.

ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దేశ వ్యవసాయాన్ని రైతాంగాన్ని ఆదుకునే విధంగా చర్యలు చేపట్టాలని లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు ఉధృతం అవుతాయని హెచ్చరించారు. ఈ క్రమంలో క్విట్ ఇండియా స్ఫూర్తితో ఆగస్టు 10 న జైల్ బరో ఆందోళన కార్యక్రమాలను జిల్లా మండల కేంద్రాల్లో కార్యకర్తలు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అలాగే రైతు డిస్కమ్ వ్యతిరేకంగా బషీర్ బాగ్ విద్యుత్ అమరవీరుల స్ఫూర్తితో ఆగస్టు 28న జిల్లా కేంద్రాల్లో కార్యక్రమాలను చేపట్టనున్నట్లు తెలిపారు.

ఈ సమావేశంలో పార్టీ కేంద్ర రాష్ట్ర నాయకులు మోర్తాల చందర్ రావు, నార్ల చంద్రశేఖర్, వస్కుల మట్టయ్య, వనం సుధాకర్, కుంభం సుకన్య, గోనె కుమారస్వామి, పెద్దారపు రమేష్, సింగతి సాంబయ్య,ఎన్ రెడ్డి,హంసారెడ్డి, బాసికర్ల బాబు, మాడిశెట్టి అరుణ్ కుమార్,

మాదం తిరుపతి, కన్నం వెంకన్న, తాటికంటి రవి, ఎస్కే నజీర్, పానుగంటి నరసయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు వంగల రాగసుధ, తుడుం అనిల్ కుమార్, తాండ్ర కళావతి, గడ్డం నాగార్జున, పల్లె మురళి, కర్ర దానయ్య, కుసుంబ బాబూరావు, మాలోత్ జబ్బర్ నాయక్క, ర్రోళ్ల శ్రీనివాస్, పసుపులేటి వెంకటేష్పో, తుగంటి కాశి, మేక మోహన్ రావు, మాలోతు సాగర్, నీల రవీందర్, సంగతి మల్లికార్జున్, మాస్ సావిత్రి, కనకం సంధ్య,రాజేష్ నాయక్, భాషపాక రమేష్, నరసయ్య లతోపాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు