Good News : దక్షిణ మధ్య రైల్వే లో ఉద్యోగాలు, వేతనం 44,900

Good News : దక్షిణ మధ్య రైల్వే లో ఉద్యోగాలు, వేతనం 44,900

మనసాక్షి డెస్క్ :

దక్షిణ మధ్య రైల్వే నిరుద్యోగులకు శుభవార్త తెలియజేసింది. రైల్వే శాఖలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది . దరఖాస్తుల ప్రక్రియ కూడా ప్రారంభమైంది .

 

జూన్ 5వ తేదీతో చివరి తేదీగా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు 44 వేల రూపాయలకు పైగా వేతనం చెల్లించనున్నారు. నోటిఫికేషన్ వివరాల ప్రకారం… నర్సింగ్ సూపర్డెంట్ పోస్టులను రైల్వే శాఖలో భర్తీ చేయును.

 

ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కావడంతో ఈనెల 5వ తేదీ నుంచి దరఖాస్తుల ప్రక్రియ కూడా ప్రారంభమైంది. జూన్ 5వ తేదీ వరకు నిరుద్యోగులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.

 

ఈ ఉద్యోగాలకు నర్సింగ్ చేసిన విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చును. ఈ ఉద్యోగాలకు 42 సంవత్సరాల లోపు ఉండాలి. ఎస్సీ ,ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు సడలింపు ఉంది.

 

దరఖాస్తు చేసుకోవలసిన వెబ్సైట్ https://rrcmas.in/. దీనిలో దరఖాస్తు ఫారం పూర్తి చేయాల్సి ఉంది. ఎంపికైన అభ్యర్థులకు 44,900 వేతనం నెలకు చెల్లిస్తారు.

 

నోటిఫికేషన్ ప్రకారం 28 ఖాళీలు ఉన్నాయి. బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవలసి ఉంది.