Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsతెలంగాణరాజకీయంహైదరాబాద్

TRS : తెలంగాణలో కొత్త పార్టీ.. టిఆర్ఎస్ పేరు ప్రకటించిన కవిత..!

తెలంగాణలో మరో కొత్త పార్టీ ఆవిర్భవించింది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పేరు ప్రకటించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మునీరాబాద్ లోని అద్వైయా కన్వెన్షన్ లో ఏర్పాటు చేసిన సభలో కవిత కొత్త పార్టీ పేరును, జెండాను ఆమె ఆవిష్కరించారు.

TRS : తెలంగాణలో కొత్త పార్టీ.. టిఆర్ఎస్ పేరు ప్రకటించిన కవిత..!

మన సాక్షి, హైదరాబాద్ :

తెలంగాణలో మరో కొత్త పార్టీ ఆవిర్భవించింది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పేరు ప్రకటించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మునీరాబాద్ లోని అద్వైయా కన్వెన్షన్ లో ఏర్పాటు చేసిన సభలో కవిత కొత్త పార్టీ పేరును, జెండాను ఆమె ఆవిష్కరించారు.

కొత్త పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేన (టిఆర్ఎస్) అని ప్రకటించారు. పసుపు, ఆకుపచ్చ, నీలం రంగుతో కూడిన జెండాను కూడా ఆమె ఆవిష్కరించారు. జండా మధ్యలో తెలంగాణ మ్యాపు దానిపై టిఆర్ఎస్ అని అక్షరాలతో పార్టీ జెండాను రూపొందించారు.

ముందుగా బంజారాహిల్స్ లోని ఆమె నివాసంలో కవిత దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బంజర హిల్స్ నివాస నుంచి ర్యాలీగా బయలుదేరిన కవిత పార్టీ శ్రేణులతో కలిసి తెలంగాణ అమరవీరుల స్థూపం వరకు చేరుకొని నివాళులర్పించారు. అక్కడ ఆమె మీడియాతో మాట్లాడారు.

తెలంగాణలో సరికొత్త విప్లవం రాబోతుందని తాను కచ్చితంగా తెలంగాణ ముఖ్యమంత్రి అవుతానని ధీమా వ్యక్తం చేశారు. నిరుపేద బడుగు బలహీన వర్గాల గొంతుకనై పోరాటం చేస్తానని కవిత స్పష్టం చేశారు.

https://x.com/RaoKavitha/status/2047900207447523701?s=20

ఇవి కూడా చదవండి : 

మరిన్ని వార్తలు