Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణరాజకీయంసంగారెడ్డి జిల్లా

MLA : కాలేశ్వరం తీర్పు.. తెలంగాణ ప్రజల విజయం.. ఎమ్మెల్యే మాణిక్ రావు..! 

కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణకు సంబంధించి తెలంగాణ హైకోర్టు వెలువరించిన తీర్పు తెలంగాణ ప్రజల విజయమనీ ఎమ్మెల్యే మాణిక్ రావు అన్నారు. గురువారంతన కార్యాలయం లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశం లో మాట్లాడారు.

MLA : కాలేశ్వరం తీర్పు.. తెలంగాణ ప్రజల విజయం.. ఎమ్మెల్యే మాణిక్ రావు..! 

జహీరాబాద్, మనసాక్షి

కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణకు సంబంధించి తెలంగాణ హైకోర్టు వెలువరించిన తీర్పు తెలంగాణ ప్రజల విజయమనీ ఎమ్మెల్యే మాణిక్ రావు అన్నారు. గురువారం తన కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో మాట్లాడారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, అప్పటి భారీ నీటి పారుదల శాఖ మంత్రి వర్యులు హరీష్ రావులు నైతిక విజయం సాధించారన్నారు.

ఈ తీర్పుతో బీఆర్ఎస్ శ్రేణుల్లో పండగ వాతావరణం నెలకొందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే కేసీఆర్‌పై బురద చల్లాలని చూస్తోందని, కానీ న్యాయస్థానం తీర్పుతో అది సాధ్యం కాదని తేలిపోయిందని ఎమ్మెల్యే మాణిక్ రావు విమర్శించారు. చట్టవిరుద్ధమైన పద్ధతుల్లో కమిషన్లు వేసి ఇబ్బంది పెట్టాలని చూస్తే న్యాయవ్యవస్థ చూస్తూ ఊరుకోదని ఈ తీర్పు రుజువు చేసిందన్నారు.

కేసీఆర్ తెలంగాణ బాగు కోసం రేయింబవళ్లు శ్రమించి కాళేశ్వరం వంటి అద్భుత ప్రాజెక్టును నిర్మించారని, ఆయన చిత్తశుద్ధిని శంకించడం ఎవరి తరమూ కాదని ఆయన స్పష్టం చేశారు.సత్యం ఎప్పుడూ నిలకడగా ఉంటుంది. కేసీఆర్ నాయకత్వంపై మాకు, ప్రజలకు పూర్తి నమ్మకం ఉంది.

రాజకీయంగా ఎదుర్కోలేక , ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని నిలదీస్తున్న మా నాయకులను ఘోష్ కమిషన్ పేరిట ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఇలాంటి కుట్రలను ప్రజలే తిప్పికొడతారని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ గొంతు ఎండిపోకుండా భగీరథ ప్రయత్నం చేసిన నాయకుడు కేసీఆర్ అని. హైకోర్టు తీర్పుతో అసలు నిజం నిగ్గుతేలిం దన్నారు. ఇది తెలంగాణ ప్రజల విజయమని అభివర్ణించారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గుండప్ప, జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు నారాయణ, కోయిర్ మండల పార్టీ అధ్యక్షులు నర్సింలు. ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు బండి మోహన్, మాజి పట్టణ అధ్యక్షులు యాకూబ్, మున్సిపల్ కౌన్సిలర్ లు గౌస్ గౌరీ,దీపక్, విశ్వేశ్వర్, ప్రవీణ్, సర్పంచ్ లు మచ్చేందర్, మోహన్ రాథోడ్, రాథోడ్ భీమ్ రావు నాయక్, బాల్ రాజ్, దేశెట్టి పాటిల్, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు