Karimnagar : 63 కిలోల గంజాయి దగ్ధం..!
కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన 38 కేసుల్లో స్వాధీనం చేసుకున్న 63.621 కిలోల గంజాయిని, ఒక గంజాయి మొక్కను బుధవారం పోలీసులు అధికారికంగా ధ్వంసం చేశారు.

Karimnagar : 63 కిలోల గంజాయి దగ్ధం..!
కరీంనగర్ జులై 29, మనసాక్షి :
కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన 38 కేసుల్లో స్వాధీనం చేసుకున్న 63.621 కిలోల గంజాయిని, ఒక గంజాయి మొక్కను బుధవారం పోలీసులు అధికారికంగా ధ్వంసం చేశారు. కరీంనగర్ పోలీస్ కమీషనర్ గౌస్ ఆలం నేతృత్వంలో, డ్రగ్ డిస్పోసల్ కమిటీ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ జరిగింది.
మానకొండూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈదులగట్టెపల్లి గ్రామంలో ఉన్న వెంకటరమణ ఇన్సినేటర్ భట్టీలో ఈ గంజాయిని పూర్తిగా దహనం చేసినట్లు పోలీస్ కమీషనర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏసీపీలు శ్రీనివాస్ జి, వెంకటస్వామి, ఇన్స్పెక్టర్లు రఫీక్, శ్రీలత, ఆర్ఐలు రజినీకాంత్, శ్రీధర్ రెడ్డిలతో పాటు ఇన్సినరేటర్ ప్లాంట్ ప్రతినిధులు తిరుపతి, ప్రభాకర్ రెడ్డి మరియు ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మాదకద్రవ్యాల నిర్మూలనలో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.










