Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలునల్గొండ

Breaking : చింతపల్లిలో నార్కోటిక్స్ డాగ్స్ తో పోలీసులు ముమ్మర తనిఖీలు..!

నల్గొండ జిల్లా చింతపల్లి మండలం కేంద్రంలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు బుధవారం చింతపల్లి ఎస్సై ముత్యాల రామ్మూర్తి నార్కోటిక్స్ డాగ్ బృందంతో ముమ్మర తనిఖీలు చేపట్టారు.

Breaking : చింతపల్లిలో నార్కోటిక్స్ డాగ్స్ తో పోలీసులు ముమ్మర తనిఖీలు..!

చింతపల్లి. జులై 29 మన సాక్షి :

నల్గొండ జిల్లా చింతపల్లి మండలం కేంద్రంలో
జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు బుధవారం చింతపల్లి ఎస్సై ముత్యాల రామ్మూర్తి నార్కోటిక్స్ డాగ్ బృందంతో ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని అన్ని పాన్ షాపులు, కిరాణా షాపులు మరియు టీ స్టాల్ ల లో తనిఖీలు నిర్వహించడం జరిగినది.

ఎవరైనా నిషేధిత మత్తు పదార్థాలు గంజాయి పాన్ పరాగ్, గుట్కా విక్రయించినట్లయితే కఠినమైన చర్యలు తీసుకోవడంతోపాటు పిడి యాక్ట్ కేసులు నమోదు చేయబడతాయని హెచ్చరికలు జారీ చేశారు.

చెడు వ్యసనాలకు యువత బానిసలై ఆత్మహత్యలు చేసుకోవడంతో పాటు. దోపిడీ దొంగతనాలకు పాల్పడుతున్నారని, గంజాయి మత్తులో యువత సమాజానికి చీడపురుగులు గా తయారవుతున్నారని దోపిడీలు నేరాలను అరికట్టేందుకు జిల్లా ఎస్పీ ఈ నిర్ణయం తీసుకున్నారని చింతపల్లి ఎస్సై ముత్యాల రామ్మూర్తి పేర్కొన్నారు. మండలంలోని గ్రామాల్లో గంజాయి లాంటి మత్తు పదార్థాలు , యువతకు విక్రయించిన ప్రోత్సహించిన తమకు సమాచారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చింతపల్లి పోలీస్ బృందం నార్కోటి బృందం, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు