Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
క్రైంBreaking Newsజిల్లా వార్తలుసూర్యాపేట జిల్లా

Garidepally : కారుపై పడిన కరెంటు స్తంభం..!

గరిడేపల్లి మండల పరిధిలోని కొండాయిగూడెం– పరెడ్డిగూడెం మధ్య రహదారి నిర్మాణం సాంక్షన్ అయినప్పటికీ పూర్తి స్థాయిలో పనులు చేయకుండా కేవలం కంకర పోసి వదిలేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Garidepally : కారుపై పడిన కరెంటు స్తంభం..!

గరిడేపల్లి, మన సాక్షి :

సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల పరిధిలోని కొండాయిగూడెం– పరెడ్డిగూడెం మధ్య రహదారి నిర్మాణం సాంక్షన్ అయినప్పటికీ పూర్తి స్థాయిలో పనులు చేయకుండా కేవలం కంకర పోసి వదిలేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ రహదారిపై వాహనాలు తరచుగా స్కిడ్ అవుతూ ప్రమాదాలకు గురవుతున్నాయి.

శుక్రవారం మధ్యాహ్నం కొండాయిగూడెంకు చెందిన కేతిరెడ్డి వీరారెడ్డి (ప్రస్తుతం ఎల్బీనగర్ నివాసం) ఒక కుటుంబ కార్యక్రమానికి వెళ్లి తిరిగి వస్తుండగా, ఆయన ప్రయాణిస్తున్న కారు కంకర రహదారిపై స్కిడ్ అయి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో కరెంట్ పోల్ విరిగి కారుపై పడింది.

అయితే అదృష్టవశాత్తు కారులో ఉన్న వ్యక్తికి ఎలాంటి ప్రాణాపాయం జరగకపోగా, కారు స్వల్పంగా దెబ్బతిన్నది. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రహదారి పనులను పూర్తిచేసి, ప్రయాణికుల భద్రతకు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి : 

మరిన్ని వార్తలు