PM KISAN : పి ఎం కిసాన్ డబ్బులు ఎకౌంట్లోకి రావాలంటే రైతులు ఇలా చేయాలి..!

PM KISAN : పి ఎం కిసాన్ డబ్బులు ఎకౌంట్లోకి రావాలంటే రైతులు ఇలా చేయాలి..!

మనసాక్షి, వెబ్ డెస్క్:

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యవసాయ రంగంలో రైతులను ఆదుకునేందుకు పీఎం కిసాన్ పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ పథకం ద్వారా ప్రతి రైతుకు దేశవ్యాప్తంగా సంవత్సరానికి 6000 ఆర్థిక సహాయం చేస్తుంది.

 

మూడు విడుదలుగా 2000 రూపాయల చొప్పున ప్రతి ఏటా 6000 రూపాయలు రైతుల అకౌంట్లోకి నేరుగా ట్రాన్స్ఫర్ అవుతాయి. ఈ ఏడాది మొదటి విడతగా మే నెలలో గాని జూన్ మొదటి వారంలో గాని పీఎం కిసాన్ డబ్బులు ప్రతి రైతు ఖాతాలో 2000 రూపాయలు పడే అవకాశం ఉంది. ప్రభుత్వం నుంచి అధికారికంగా ఎప్పుడు ఖాతాలో పడతాయి అనే విషయం ప్రకటించకపోయినప్పటికీ ఈ సీజన్ ప్రారంభమవుతున్నందున త్వరలో పడే అవకాశం ఉంది.

 

2018లో ఈ పథకం ప్రకటించినప్పటికీ 2019 నుంచి అమలులోకి వచ్చింది. దేశవ్యాప్తంగా ఎనిమిది కోట్ల మంది రైతులకు ఈ పథకం వర్తిస్తుంది . ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం 13 విడతలుగా 2000 రూపాయలు చొప్పున రైతుల ఖాతాలో నేరుగా జమ చేసింది . 14వ విడత రైతుల ఖాతాలోకి 2000 రూపాయలు జమ కాగా పీఎం కిసాన్ పథకం కింద డబ్బులు ఎకౌంట్లో పడాలంటే ముందుగా రైతులు తమ పేరు ఉందో..? లేదో..? సరిచూసుకోవాలి.

 

ముందుగా పీఎం కిసాన్ బెనిఫిషరీ లిస్టులో పేరు ఉందో..? లేదో..? చూసుకోవాలంటే

 

https://www.pmkisan.gov.in వెబ్ సైట్ ఓపెన్ చేయాలి. హోం పేజీలో farmer corner సెక్షన్ లో Benifishary status క్లిక్ చేయాలి. రిజిస్ట్రేషన్ నెంబర్ లేదా మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. క్యాప్స ఎంటర్ చేసి get data క్లిక్ చేయాలి. వెంటనే బెనిఫిషర్ లిస్ట్ స్క్రీన్ పైన కనిపిస్తుంది.

 

అకౌంట్ లోకి డబ్బులు రావాలంటే ఈ విధంగా చేయాల్సి ఉంది.

 

https//www.pmkisan.gov.in/ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. హోమ్ పేజీలో Farmers corner సెక్షన్లో new farmer registration క్లిక్ చేయాలి. గ్రామీణ రైతు అయితే rural farmer registration, పట్టణ ప్రాంత రైతు అయితే urban farmer registration సెలెక్ట్ చేయాలి. మొబైల్ నెంబర్ , ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి రాష్ట్రం పేరు సెలెక్ట్ చేయాలి.

 

ఆ తర్వాత క్యాప్సా ఎంటర్ చేయాలి. Get OTP క్లిక్ చేయాలి. మీ మొబైల్ నెంబర్ కు వచ్చే OTP ని ఎంటర్ చేయాలి. ఆ తర్వాత రైతుకు సంబంధించిన పూర్తి వివరాలు భూమికి సంబంధించిన వివరాలు ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. పీఎం కిసాన్ బెనిఫిషరీ లిస్టులో పేరు నమోదు అవుతుంది.

 

ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ప్రభుత్వం అందజేసే రెండు వేల రూపాయలు బ్యాంకు ఖాతాలో జమ అవుతాయి.