Phonepe : ఫోన్ పే వాడుతున్నారా…? అయితే మీకు ఓ గుడ్ న్యూస్..!

Phonepe : ఫోన్ పే వాడుతున్నారా…? అయితే మీకు ఓ గుడ్ న్యూస్..!
మనసాక్షి , వెబ్ డెస్క్:
ప్రస్తుత పరిస్థితుల్లో ఫోన్ పే వాడని వారంటూ ఎవరూ లేరు. 10 రూపాయల నుంచి కూడా వేలాది రూపాయల వరకు కూడా ఫోన్ పే లోనే ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు ఫోన్ పే ద్వారా చెల్లింపులు చేస్తున్నారు.
ఇప్పుడు ఫోన్ పే వాడే వాళ్లకు ఓ శుభవార్త వచ్చింది. ఏంటంటే ఈ UPI కి రెండు లక్షల రూపే క్రెడిట్ కార్డులను అనుసంధానం చేసింది.
Also Read : PM KISAN : పి ఎం కిసాన్ డబ్బులు ఎకౌంట్లోకి రావాలంటే రైతులు ఇలా చేయాలి..!
రూపే క్రెడిట్ కార్డు తో ఫోన్ పే యూజర్లు, వ్యాపారస్తులు నగదు చెల్లింపులను ఈజీగా చేసుకోవచ్చు. ఈ విషయాన్ని ఐ ఏ ఎన్ ఎస్ నివేదిక ప్రకటనలో పేర్కొన్నది.
ఫోన్ పే యూజర్లకు యూపీఐ నిర్వహణ సంస్థ ఎన్ సి పి ఐ తో కలిసి రూపే క్రెడిట్ కార్డును అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఫోన్ పే వెల్లడించింది. దేశ వ్యాప్తంగా 12 మిలియన్ల మర్చంట్ అవుట్ లెట్లను ఆమోదం పొందినట్లు నివేదికలో తెలియజేశాయి.
Also Read : Good News : దక్షిణ మధ్య రైల్వే లో ఉద్యోగాలు, వేతనం 44,900
రూపే క్రెడిట్ కార్డ్(Rupay Cridit Card) యూపీఐ తో కలిసి తొలిసారి క్రెడిట్ కార్డును ఇలా ఉపయోగించి యూపీఐ చెల్లింపులు చేయడం వలన దేశంలోనే ఫోన్ పే తొలి సంస్థగా గుర్తింపు సాధించింది.
ఫోన్ పే యూపీఐ ద్వారా 2 లక్షల రూపాయల క్రెడిట్ కార్డును ఉపయోగించి చెల్లింపులు జరిపేలా ఎన్ పీ సీఐ భాగస్వామ్యంతో కలవడం ఎంతో ఆనందంగా ఉందని ఫోన్ పే కస్టమర్ అండ్ పేమెంట్స్ వైస్ ప్రెసిడెంట్ సోనికా చంద్ర వెల్లడించారు .
కస్టమర్లు, వ్యాపారులు జరిపే చెల్లింపుల్ని సులభతరం చేసేందుకు క్రెడిట్ కార్డు ఇకో సిస్టంను అభివృద్ధి చేశారు.