హైదరాబాద్ | టీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్… ఇక అందరికీ బస్ పాస్ లు.. సగం డబ్బులు ఆదా..!

హైదరాబాద్ | టీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్… ఇక అందరికీ బస్ పాస్ లు.. సగం డబ్బులు ఆదా..!

హైదరాబాద్, మనసాక్షి :

తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు మరింత చేరువయ్యేందుకు అనేక నూతన స్కీం లను తీసుకొస్తుంది. ప్రయానికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడంతో పాటు ఆదాయ మార్గాల వైపు కూడా అన్వేషిస్తుంది.

 

హైదరాబాద్ లో ఆర్టీసీ బస్సులో ప్రయాణించే వారికి తెలంగాణ ఆర్టీసీ శుభవార్త తెలియజేసింది. హైదరాబాదులో సొంత వాహనాలతో పాటు ప్రైవేటు వాహనాలు, మెట్రో ఉన్నప్పటికీ ఆర్టీసీ కి ఆదరణ ఎక్కువగానే ఉంది. చాలామంది ఆర్టీసీ బస్సులోనే ప్రయాణిస్తుంటారు.

సామాన్యులకు అందుబాటులో ఉండే బస్ ఛార్జీల వలన సుఖవంతంగా ప్రయాణం చేయడానికి ఎక్కువ మంది ఆర్టిసి బస్సు ఎక్కించుకుంటారు. అందుకు గాను ప్రయాణికులకు శుభవార్త తెలియజేసింది.

 

Also Read : Smart phone : మీ ఫోన్ స్లో అయిందా..? అయితే ఇలా చేయండి చాలు..!

 

ఇప్పటివరకు విద్యార్థులకు, మహిళలకు, వయోజనులకు బస్ పాస్ సౌకర్యాలను కలిగించిన టిఎస్ఆర్టిసి ఇక రోజువారి ప్రయాణికులకు కూడా తక్కువ ధరలకు బస్ పాస్ సౌకర్యం కల్పించనున్నది.

 

దీనివల్ల ప్రయాణికులకు సగం డబ్బులు ఆదా కానున్నాయి. గ్రేటర్ హైదరాబాదులో 162 రూట్లలో ఈ బస్ పాస్ లు జారీ చేయనున్నట్లు పార్టీ ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.

 

Also Read : Whatsapp : వాట్సాప్ లో అదిరిపోయే ఫీచర్ స్క్రీన్ షేరింగ్.. ఎలా చేయాలో తెలుసుకుందాం..!

600 రూపాయలతో ఆర్డినరీ పాస్, 1000 రూపాయలతో మెట్రోపాస్ గా ధరలు నిర్ణయించారు. ఈ బస్సు పాస్ సహకారంతో నిర్ణీత రూట్ లో 8 కిలోమీటర్ల దూరంలో రోజుకు ఎన్నిసార్లైనా రాకపోకలు సాధించవచ్చునని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.

 

బస్సు పాస్ ద్వారా సగం ధరకే ప్రతిరోజు రాకపోకలు సాగించవచ్చును. బస్ పాస్ ల కోసం టిఎస్ఆర్టిసి వెబ్ సైట్ గాని బస్ పాస్ కౌంటర్ల వద్ద గాని సంప్రదించవచ్చును.