Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ
Miryalaguda : మిర్యాలగూడ రైస్ మిల్లుల్లో టాస్క్ ఫోర్స్ అధికారుల దాడులు
నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని పలు రైస్ మిల్లులపై స్టేట్ టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు.

Miryalaguda : మిర్యాలగూడ రైస్ మిల్లుల్లో టాస్క్ ఫోర్స్ అధికారుల దాడులు
మిర్యాలగూడ, మన సాక్షి :
నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని పలు రైస్ మిల్లులపై మంగళవారం స్టేట్ టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు. బియ్యం ధరలు పెంచడం. వరి ధాన్యం కొనుగోలుకు ధరలు తగ్గించడం పై వస్తున్న ఆరోపణల విషయంపై టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు. బియ్యం బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు విక్రయించడం, దాన్యం కొనుగోలు అవకతవకలు చేపడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రైస్ మిల్లర్లను అధికారులు హెచ్చరించారు. ఈ తనిఖీలలో స్టేట్ టాస్క్ ఫోర్స్ అధికారులు, లీగల్ మెట్రాలజీ అధికారులు, సివిల్ సప్లై అధికారులు పాల్గొన్నారు.









