Phone pe : ఫోన్ పే కీలక మార్పులు.. వాడేవారంతా తెలుసుకోవాల్సిందే..!

Phone pe : ఫోన్ పే కీలక మార్పులు.. వాడేవారంతా తెలుసుకోవాల్సిందే..!
మనసాక్షి , వెబ్ డెస్క్ :
ఫోన్ పే సేవలను ఎంతోమంది వినియోగిస్తున్నారు. ఇది ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ యూజర్లకు సేవలందిస్తుంది. ఇటీవల ఫోన్ పే అనేక కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది. అందులో భాగంగా కొత్తగా అకౌంట్ సేవలను ప్రవేశపెట్టింది.
దీంతో ఫోన్ పే యూజర్లు ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించిన వివరాలను ఇతర బ్యాంకులు గానీ ఆర్థిక సంస్థలకు బదిలీ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. దీని ద్వారా రుణాలు, బ్యాంక్ స్టేట్ మెంట్లు, ఇన్సూరెన్స్ సేవలన్నింటినీ షేర్ చేసుకోవచ్చు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్ డి ఎఫ్ సి, ఐసిఐసిఐ, యాక్సిస్, కోటక్ మహేంద్ర , వంటి బ్యాంకులతోపాటు ఎల్ఐసి, నేషనల్ ఇన్సూరెన్స్ ,యునైటెడ్ ఇన్సూరెన్స్ లాంటి 100కు పైగా ఆర్థిక సంస్థల సేవలను ఒకే యాప్ ద్వారా అందించనున్నట్లు పేర్కొన్నది.
దీనికోసం ఫోన్ పే యాజమాన్యం పలు బ్యాంకులతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఆయా సేవలన్నింటినీ ఏకీకృతం చేసి ఈ యాప్ ద్వారా వేర్వేరు సర్వీసులను పొందే అవకాశాన్ని కల్పించింది.
ఫోన్ పే ద్వారా బ్యాంకుల నుంచి స్టేట్మెంట్లను సైతం డౌన్ లోడ్ చేసుకోవచ్చును. వాటిని ఇతర బ్యాంకులు ఆర్థిక సంస్థలకు ట్రాన్ ఫర్ చేసుకోవచ్చు.
Also Read : Wifi : మీ వైఫై రూటర్ 24 గంటలు ఆన్ లోనే ఉంచుతున్నారా..? అయితే ఇది చూడాల్సిందే ..!
అంతేకాకుండా ఇన్సూరెన్స్ పాలసీ వివరాలను పొందే వెసులుబాటు కూడా కల్పించింది. ఫోన్ పే సేవలను మరింత ఫ్రెండ్లీగా మార్చడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫోన్ పే యాజమాన్యం పేర్కొన్నది.
ఎస్ బ్యాంక్ , ఫెడరల్ బ్యాంక్ , స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లాంటి ఫైనాన్షియల్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్ల సర్వీసులను కూడా అగ్ని గేట్ చేశారు.
Also Read : Central Govt : కేంద్రం కీలక నిర్ణయం.. సామాన్యులకు ఊరట..!
బ్యాంకింగ్ తరహా సేవలను అందించడానికి 2021 ఆగస్టు 26న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతులు వచ్చాయి. ఈ సౌకర్యం వల్ల యూజర్లు ఏ బ్యాంకులో అకౌంట్ ఉన్నప్పటికీ తమ ఆర్థిక కార్యకలాపాలన్నింటిని తెలుసుకోవచ్చును. వాటిని యాక్సిస్ పొందవచ్చును.
also read : హైదరాబాద్ | టీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్… ఇక అందరికీ బస్ పాస్ లు.. సగం డబ్బులు ఆదా..!