Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESఆంధ్రప్రదేశ్జాతీయంజిల్లా వార్తలుతెలంగాణహైదరాబాద్

RBI : రూ. 500 నోట్లపై ఆర్ బీ ఐ కీలక ప్రకటన..!

RBI : రూ. 500 నోట్లపై ఆర్ బీ ఐ కీలక ప్రకటన..!

మనసాక్షి, వెబ్ డెస్క్ :

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) 2000 రూపాయల నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే . కాగా 2000 రూపాయల మార్పిడిని అన్ని బ్యాంకులలో తీసుకోవాలని ఆర్బిఐ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ మేరకు 2000 రూపాయల నోట్లు ఉన్న ప్రతి ఒక్కరు బ్యాంకులలో మార్పిడి చేసుకుంటున్నారు.

 

2000 రూపాయల నోట్ల రద్దు అనంతరం ప్రజలలో ఊహాగానాలు పెరిగిపోయాయి. రెండు వేల రూపాయల నోటు స్థానంలో వేయి రూపాయల నోటు తిరిగి వస్తుందని, 500 రూపాయల నోటు కూడా రద్దు అవుతుందని ప్రచారం జోరుగా సాగుతోంది.

 

ALSO READUpi Payments | ప్రతిరోజు ఎక్కువ సార్లు యూపీఐ పేమెంట్స్ చేస్తున్నారా..? అయితే ఈ విషయం తప్పక తెలుసుకోవాల్సిందే..!

 

2016 నవంబర్ 8 వరకు 1000, 500 రూపాయల నోటు ఉండగా దానిని రద్దు చేసిన విషయం తెలిసింది. ఆ సమయంలో నగదు కొరత రాకుండా ఉండేందుకు గాను 2000 రూపాయల నోట్లను ప్రవేశపెట్టింది. 2000 రూపాయల నోట్లను కూడా 2019లో ముద్రణ నిలిపివేసింది. తిరిగి ప్రస్తుతం వాటిని కూడా రద్దు చేసింది.

 

1000 రూపాయల నోటు తో పాటు 500 రూపాయల నోట్లను కూడా ఆర్బిఐ రద్దు చేస్తుందనే విషయం జోరుగా ప్రచారం సాగింది. దాంతో ప్రజలలో కొంత మేరకు ఆందోళన కలిగింది. కాగా ఆర్.బి.ఐ గవర్నర్ శక్తి కాంత దాస్ ద్రవ్యపరిమితి విధాన సమీక్ష సమావేశం గురువారం నిర్వహించారు. అనంతరం ఆయన కీలక ప్రకటన చేశారు.

 

ALSO READ : Gpay : గూగుల్ పే కొత్త ఫీచర్…. డెబిట్ కార్డు తో పనిలేదు.. ఆధార్ కార్డు ఉంటే చాలు..!

1000 రూపాయల నోటు కొత్తగా రానున్నదనే ప్రచారాన్ని ఆయన ఖండించారు. 1000 రూపాయల నోటను తీసుకొచ్చే ఆలోచన ఆర్బిఐ కి లేదని ఆయన ప్రకటించారు. అదేవిధంగా 500 రూపాయల నోట్లను కూడా రద్దు చేసే ఆలోచన ఆర్బిఐ కి లేదని స్పష్టం చేశారు. 500 రూపాయల నోట్లను ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తీసుకునే ఆలోచన లేదని అలాంటి ప్రచారం ఎందుకు జరుగుతుందో అర్థం కావడం లేదని అలాంటి ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని సూచించారు.

మరిన్ని వార్తలు