ATM CARD | ఏటీఎం కార్డు లేకుండా డబ్బులు డ్రా .. బ్యాంకు కొత్త సర్వీస్.. ఎలా చేయాలో తెలుసుకుందాం..!

ATM CARD | ఏటీఎం కార్డు లేకుండా డబ్బులు డ్రా .. బ్యాంకు కొత్త సర్వీస్.. ఎలా చేయాలో తెలుసుకుందాం..!

మనసాక్షి , వెబ్ డెస్క్ :

ఏటీఎం సెంటర్ కి వెళ్లి డెబిట్ కార్డు సహాయంతో ప్రస్తుతం డబ్బులు రా చేస్తున్న విషయం తెలిసిందే. ఇకపై ఏటీఎం కార్డు లేకుండానే డబ్బులు డ్రా చేసేందుకు బ్యాంకు కొత్త సర్వీస్ లను అందుబాటులోకి తీసుకొచ్చింది.

 

ఏటీఎం కార్డు లేకుండా మీ స్మార్ట్ ఫోన్ ద్వారా స్కాన్ చేస్తే సరిపోతుంది. ఏటీఎం నుండి డబ్బులు వచ్చేస్తాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా తాజాగా ఈ కొత్త సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది.

కార్డ్ లెస్ క్యాష్ విత్ డ్రాయల్ సర్వీసులను లాంచ్ చేసింది. బ్యాంక్ ఆఫ్ బరోడా వినియోగదారులకు యూపీఐ ద్వారా ఏటీఎం నుంచి డబ్బులు పొందే అవకాశాన్ని కల్పించింది. యూపీఐ స్కాన్ ద్వారా డబ్బులు డ్రా చేయడం ప్రభుత్వ రంగ బ్యాంకులలో మొట్టమొదటిదిగా బ్యాంక్ ఆఫ్ బరోడా నిలిచింది.

 

ALSO READ : Central Govt : కేంద్రం కీలక నిర్ణయం.. సామాన్యులకు ఊరట..!

డెబిట్ కార్డు లేకుండా బ్యాంకు వినియోగదారులు యూపీఐ యాప్స్ ద్వారా బ్యాంకు ఎటిఎం నుంచి డబ్బులు డ్రా చేసుకోవచ్చును. యూపీఐ యాప్ అనేది ఐ సి సి డబ్ల్యూ ఎనేబుల్ ఫ్యూచర్ కలిగి ఉండాలి.

 

ఎలా డ్రా చేయాలి ..?

 

బ్యాంక్ ఆఫ్ బరోడా ఏటీఎం సెంటర్ కు వెళ్ళినప్పుడు ఏటీఎం మిషన్ లో యూపీఐ క్యాష్ విత్ డ్రాయల్ ఫీచర్ పెంచుకోవాల్సి ఉంటుంది. మీరు ఎంత డబ్బులు విత్ డ్రా చేయాలని చూస్తున్నారో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఏటీఎం స్క్రీన్ పై క్యూ ఆర్ కోడ్ కనిపిస్తుంది. యూపీఐ యాప్ ఓపెన్ చేసి అందులో స్కానర్ ద్వారా మీ ఫోన్ తో క్యూ ఆర్ కోడ్ ను స్కాన్ చేయాలి. ఆ తర్వాత ట్రాన్జక్షన్ పూర్తి అవుతుంది. ఏటీఎం నుంచి డబ్బులు వస్తాయి.

 

ALSO READ : Gpay : గూగుల్ పే కొత్త ఫీచర్…. డెబిట్ కార్డు తో పనిలేదు.. ఆధార్ కార్డు ఉంటే చాలు..!

 

ప్రస్తుతం బ్యాంక్ ఆఫ్ బరోడా క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా డబ్బులు డ్రా చేసుకునే విధానాన్ని ప్రవేశపెట్టింది. కాగా త్వరలో మిగతా బ్యాంకులు కూడా అదే దారిలో ఏటీఎం కార్డు లేకుండా డబ్బులు డ్రా చేసుకునే విధానాన్ని తీసుకురానున్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా దేశవ్యాప్తంగా 11 వేలకు పైగా ఏటీఎంలో కలిగి ఉంది