Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESజిల్లా వార్తలుతెలంగాణహైదరాబాద్

Gruhalaxmi : సొంత స్థలం ఉంటే తెలంగాణ గృహలక్ష్మి పథకం.. రూ. 3 లక్షలు ఇలా పొందండి..!

Gruhalaxmi : సొంత స్థలం ఉంటే తెలంగాణ గృహలక్ష్మి పథకం.. రూ. 3 లక్షలు ఇలా పొందండి..!

మనసాక్షి , వెబ్ డెస్క్ :

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పేదలకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. గతంలో ఉన్న ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకాన్ని రద్దుచేసి డబల్ బెడ్ రూమ్ పథకాన్ని తీసుకువచ్చారు . కాగా రెండు పర్యాయాలు బి ఆర్ ఎస్ అధికారంలోకి వచ్చినప్పటికీ చాలాచోట్ల డబుల్ బెడ్ రూమ్ పథకం అందుబాటులోకి రాలేదు.

 

పేదలకు ఇంటి స్థలాలతో పాటు ఇండ్ల నిర్మాణం కల కూడా నెరవేరలేదు. డబుల్ బెడ్ రూమ్ గృహాలు అనేక చోట్ల నిర్మాణాలు చేసినప్పటికీ సౌకర్యాలు లేకపోవడంతో వేలవెలబోతున్నాయి. మరికొన్ని చోట్ల పంపిణీకి కూడా నోచుకోలేదు.

 

ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పేదలకు ఇండ్ల నిర్మాణం కోసం ఒక అద్భుతమైన పథకాన్ని తీసుకువచ్చారు. సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకునే వారికి గృహ లక్ష్మీ పథకాన్ని వర్తింప చేస్తామని ప్రకటించారు. ఈ విషయం పేద పేద ప్రజల్లో ఆనందాన్ని కలిగించింది. సొంత స్థలం ఉన్నవారు ఇల్లు నిర్మించుకోవడానికి ఎంతో మంది ఎదురుచూస్తున్నారు.

 

ప్రభుత్వం నుంచి గృహ లక్ష్మీ పథకం ద్వారా మూడు లక్షల రూపాయలను అందజేయనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విషయం విధితమే. కాగా అందుకుగాను గృహ లక్ష్మీ పథకం ద్వారా లబ్ధిదారులను ఎంపిక ఎలా చేయాలి..? వారికి 3 లక్షల రూపాయల సహాయం ఎలా అందించాలి అనే విషయంపై అధికారులు కసరత్తు నిర్వహిస్తున్నారు.

 

ఈ పథకం యొక్క విధి విధానాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఫైనల్ చేసినట్లు సమాచారం. మూడు లక్షల రూపాయల సహాయాన్ని ఇంటి నిర్మాణం చేసుకునే వారికి మూడు విడతలుగా అందించడానికి నిర్ణయించినట్లు తెలుస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామంలో మొదటి విడతగా ఐదుగురు లబ్ధిదారులను ఎంపిక చేసి వారికి సహాయం అందించే బాధ్యత ఎమ్మెల్యేలకు అప్పగించినట్లు తెలిసింది.

 

ALSO READ : RBI : రూ. 500 నోట్లపై ఆర్ బీ ఐ కీలక ప్రకటన..!

 

గ్రామీణ ప్రాంతాలలో 100 గజాల నుంచి 250 గజాలు, పట్టణాలలో 80 గజాలు ఉంటే గృహలక్ష్మి పథకానికి లబ్ధిదారులు అర్హులుగా అధికారులు ఖరారు చేశారు . ఈ పథకాన్ని ఇంటి యజమానురాలు మహిళ పేరుమీద ఇవ్వాలనే ఉద్దేశంతో గృహలక్ష్మి అని పేరు పెట్టినట్లు సమాచారం.

 

వచ్చిన దరఖాస్తులలో ఎమ్మెల్యేలు గ్రామాల వారిగా జాబితాను ఫైనల్ చేసి జిల్లా కలెక్టర్ కు అందజేయాల్సి ఉంటుంది. ఇంటి నిర్మాణానికి గాను మూడు లక్షల రూపాయలను మూడు విడతలుగా సహాయం చేయనున్నారు. మొదటి విడతగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి మూడు వేల ఇండ్లను కేటాయించినట్లు తెలుస్తుంది.

 

ఎక్కువమంది చదివిన న్యూస్… మీరు కూడా చదవడానికి క్లిక్ చేయండి 👇

1. Rythu Bandhu : రైతు బంధు కోసం .. ఆ రైతులు ఇలా చేయాలి..!

2. ATM CARD | ఏటీఎం కార్డు లేకుండా డబ్బులు డ్రా .. బ్యాంకు కొత్త సర్వీస్.. ఎలా చేయాలో తెలుసుకుందాం..!

3. Upi Payments | ప్రతిరోజు ఎక్కువ సార్లు యూపీఐ పేమెంట్స్ చేస్తున్నారా..? అయితే ఈ విషయం తప్పక తెలుసుకోవాల్సిందే..!

4. Gpay : గూగుల్ పే కొత్త ఫీచర్…. డెబిట్ కార్డు తో పనిలేదు.. ఆధార్ కార్డు ఉంటే చాలు..!

5. Phone pe : ఫోన్ పే కీలక మార్పులు.. వాడేవారంతా తెలుసుకోవాల్సిందే..!

6. Virupaksha Memes : విరూపాక్ష మీమ్స్… నాన్ స్టాప్ కామెడీ.. నెట్టింట్లో వైరల్ (వీడియోస్)

 

మరిన్ని వార్తలు