Adipurush : ‘ఆదిపురుష్’ బ్లాక్ బస్టర్.. రామాయణమేనా ..? మరోకథనా..?

Adipurush : ‘ఆదిపురుష్’బ్లాక్ బస్టర్.. రామాయణమేనా ..? మరోకథనా..?

మనసాక్షి, సినిమా డెస్క్ :

 

నటీనటులు :

ప్రభాస్ , కృతి సన్, సైఫ్ అలీ ఖాన్, సన్నీ సింగ్, దేవ దత్త , సోనాల్ చౌహాన్

మాటలు : బీమ్ శ్రీనివాస్

పాటలు : రామజోగయ్య శాస్త్రి

చాయాగ్రహం : కార్తీక్ వాళని

నేపద్య సంగీతం : సంచిత్ ,అంకిత్

స్వరాలు : అజయ్ – అతుల్, స్టేట్ – పరంపర

నిర్మాతలు : భూషణ్ కుమార్ ,కృష్ణ కుమార్, వంశీ, ప్రమోద్ ,రాజేష్ నాయర్, ప్రసాద్ సుతార్

దర్శకత్వం : ఓం రౌత్

విడుదల : జూన్ 16 వ 2023

 

ప్రభాస్ ‘ఆదిపురుష్” సినిమా బ్లాక్ బస్టర్. అంచనాలు మించిపోయాయంటూ ఊహగానాలు వస్తున్నాయి. ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్తే ఎంజాయ్ చేయొచ్చు .. రావణుడి గెటప్, ఇతర విషయాలు ఆలోచిస్తూ సినిమా థియేటర్ లో కూర్చుంటే మాత్రం కష్టమే.

 

రావణుడి గెటప్ ఏంటి అలా ఉంది..? లంక అలా ఉంది ఏంటి..? అంటూ ఆలోచిస్తూ కూర్చుంటే చాలా కష్టం.
అప్పుడు ఇది రామాయణమైనా..? లేదంటే మరో కథనా..? అనే సందేహం కలగడం తప్పదు.

 

రామాయణం పై ఇప్పటికీ ఎన్నో సినిమాలు వచ్చాయి. రామాయణం గురించి అందరికీ తెలిసిన విషయమే. ఆది పురుష్ సినిమా కూడా వాల్మీకి రాసిన రామాయణంలో అరణ్యకాండ, యుద్ధకాండ ఆధారంగా రూపొందించిన సినిమా.

 

ఇది కూడా చదవండి.. ఎక్కువమంది చదివిన వార్తలు :

 

 

కానీ గత కథనాలు, పురాణ ఇతిహాస గ్రంథంలో ఏముంది. అనేది పక్కకు పెడితే ఓం రౌతు ఎలా తీశారు..? అని చూస్తే విజువల్స్ పరంగా కొత్తగా ఉంటుంది. 3d ఎఫెక్ట్స్ చాలా బాగుంటాయి. భావోద్వేగాలపరంగా సినిమా బాగుంది.

 

ఆది పురుష్ ఫస్టాఫ్ నిదానంగా ఉన్నప్పటికీ సెకండ్ హాఫ్ లో యుద్ధ సన్నివేశాలు, డైలాగులు బాహుబలి మాదిరిగా అనిపిస్తుంది. బాహుబలి యుద్ధాన్ని కొత్తరకంగా చూసినట్లు అనిపిస్తుంది. రాముడు బాణం వేసే స్టైల్ అందరిని ఆకట్టుకుంటుంది. ఈ సినిమా మూడు గంటల పాటు ఉంటుంది. పాటలు నేపద్య సంగీతం చాలావరకు ఆ ఫీలింగ్ లేకుండా చేశాయి.

 

ఆదిపురుష్ మూవీ స్టోరీ :

ఈ సినిమాలో శేషు (సన్నీ సింగ్) జానకి (కృతి సనన్) తో కలిసి రాఘవుడు (ప్రభాస్) వనవాసానికి వెళ్తాడు. అక్కడ అతనిని చూసిన సూర్పణఖ మనసు పారేసుకుంటుంది. తన భర్తగా ఆహ్వానిస్తుంది.

 

అప్పుడు రాఘవుడు నేను వివాహితుడిని క్షమించండి అంటాడు. సీతను చంపాలని సూర్పణఖ విపలయత్నం చేస్తుంది. సూర్పనఖ ముక్కుకు శేషు వేసిన భాను తగులుతుంది. అవమానంతో లంకకు వెళ్ళిన సూర్పణక అన్నయ్య లంకేశ్వరుడు సైఫ్ అలీ ఖాన్ దగ్గర సీత అందం గురించి గొప్పగా వర్ణిస్తుంది.

 

అప్పుడు ఆయన సాధువు వేషంలో వెళ్లి సీతను అపహరించి లంకకు తీసుకొస్తాడు. జానకిని పొందడానికి వానరసైన్యంతో రాఘవుడు యుద్ధం ఎలా చేస్తాడు..? ఆ తర్వాత ఏమవుతుంది..? అనేది సినిమాలో తెలుస్తుంది.