Breaking Newsక్రీడలుజాతరలుజిల్లా వార్తలునల్గొండ
ఘనంగా గ్రామీణ స్థాయి కోలాట పోటీలు..!
వేములపల్లి మండలంలోని రావులపెంట గ్రామంలో శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వామి జాతర మహోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం రాత్రి గ్రామీణ స్థాయి కోలాట పోటీలు ఘనంగా జరిగాయి.

ఘనంగా గ్రామీణ స్థాయి కోలాట పోటీలు..!
వేములపల్లి, మన సాక్షి:
వేములపల్లి మండలంలోని రావులపెంట గ్రామంలో శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వామి జాతర మహోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం రాత్రి గ్రామీణ స్థాయి కోలాట పోటీలు ఘనంగా జరిగాయి. కోలాటం మాస్టర్ పల్లా ప్రసాద్ ఆధ్వర్యంలో మహిళలు కోలాటం, భజన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు.
ఈ సందర్భంగా కోలాట పోటీల్లో గెలుపొందిన మహిళా బృందాలకు దాత కందుల వందన్ రెడ్డి సహకారంతో బహుమతులను దేవాలయ ప్రధాన కార్యదర్శి అవిరెండ్ల వేణు అందజేశారు. వారి వెంట వార్డ్ మెంబర్ పురాణపు సైదులు, ఉత్సవ కమిటీ సభ్యులు క్రాంతి కుమార్, ప్రశాంత్, సందీప్, పండు, నాయకులు, యువత తదితరులు ఉన్నారు.









