Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలునల్గొండ

Vemulapally : అన్ని రంగాల్లో గ్రామాభివృద్దే లక్ష్యం..!

గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని సర్పంచ్ సందరబోయిన చంద్రయ్య అన్నారు.శనివారం మండలంలోని రావులపెంట గ్రామంలో పంచాయతీ కార్యదర్శి బంటు మహేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు.

Vemulapally : అన్ని రంగాల్లో గ్రామాభివృద్దే లక్ష్యం..!

రావులపెంట సర్పంచ్ సందరబోయిన చంద్రయ్య

వేములపల్లి, మన సాక్షి:

గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని సర్పంచ్ సందరబోయిన చంద్రయ్య అన్నారు. శనివారం మండలంలోని రావులపెంట గ్రామంలో పంచాయతీ కార్యదర్శి బంటు మహేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందిస్తామని, పారిశుద్ధ్యం నిర్వహణలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ.. విస్తృతంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏ.ఈ.ఓ మాలోతు ప్రియాంక, సిపిడిఓ మమత, మాజీ ఎంపిటిసి నంద్యాల శ్రీరామ్ రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ తరి సైదులు, అంగన్వాడి టీచర్లు శీలం శారద, వెంకట రమణ, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు