RRB Recruitment : 10th అర్హతతో రైల్వే ఉద్యోగాలు.. ఈనెలాఖరులోగా దరఖాస్తులు..!

RRB Recruitment : 10th అర్హతతో రైల్వే ఉద్యోగాలు.. ఈనెలాఖరులోగా దరఖాస్తులు..!
మనసాక్షి , వెబ్ డెస్క్:
తెలుగు రాష్ట్రాలలో ఉన్న నిరుద్యోగులకు రైల్వే శాఖ శుభవార్త తెలియజేసింది. రైల్వే ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. సికింద్రాబాద్ రైల్వే లో ట్రేడ్ విభాగంలో ఖాళీలను భర్తీ చేసేందుకు ఈ నోటిఫికేషన్ వెలువడింది .
మొత్తంగా 530 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు పదవ తరగతి లేదా ఇంటర్ లేదా ఐటిఐ పూర్తి చేసి ఉండాలి. దీనికి ఎలాంటి అనుభవం కూడా అవసరం లేదు .
ఈ ఉద్యోగాలకు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన నిరుద్యోగులు ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగానికి రాత పరీక్ష కూడా ఉండదు. కేవలం మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేయనున్నారు.
ఎక్కువమంది చదివిన వార్తలు.. మీరు కూడా చదివేందుకు క్లిక్ చేయండి…👇
- Inter : ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు… ట్రైనింగ్ లోనే నెలకు రూ. 25 వేల వేతనం..!
- TSRTC : టిఎస్ ఆర్టీసి ప్రయాణికులకు బంపర్ ఆఫర్.. రూ .100 తో 60 కిలోమీటర్లు రాను పోను..!
- GPay, PhonePe : గూగుల్ పే, ఫోన్ పే హ్యాకర్లు హ్యాక్ చేయకుండా ఏంచేయాలి..? తెలుసుకుందాం .. !
- WhatsApp : వాట్సాప్ అదిరిపోయే ఫీచర్, మాటల్లేవ్ .. ఇక మాట్లాడుకోవడాల్లేవ్..!
- Viral video : ఉప్పుతో గీత గీస్తే నాగుపాము దాటలేదా..? ( వీడియో వైరల్)
- Phonepe : ఫోన్ పే లో ఉద్యోగాల భర్తీ .. ఏదైనా డిగ్రీ ఉంటే చాలు.. రూ. 35 వేల జీతం..!
ఖాళీలు, విద్యార్హతలు :
ఇండియన్ రైల్వేస్ నుండి ఈ ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్ వెలువడింది. రైల్వే శాఖలో ఖాళీగా ఉన్నటువంటి ట్రేడ్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అన్ని విభాగాలలో 530 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేయనున్నారు. అందుకు సంబంధించి టెన్త్ /ఇంటర్ పూర్తి చేసి ఉండాలి.
దరఖాస్తు :
దరఖాస్తుకు అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ లోని పురుషులు 100 రూపాయలకు పైగా సర్వీస్ ఛార్జి చెల్లించాల్సి ఉంటుంది. మిగతా వారు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
వయసు పరిమితి :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారు వయసు 15 నుండి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తించనున్నాయి. ఓబీసీ వారికి మూడు సంవత్సరాలు, ఎస్సీ/ ఎస్టీ వారికి ఐదు సంవత్సరాల మినహాయింపు ఉంది.
ఎంపిక విధానం :
రైల్వే శాఖలో ఉద్యోగాలను కేవలం మెరిట్ ఆధారంగా షార్టు లిస్టు చేస్తారు. అందులో మెరిట్ లిస్టు మొదటగా విడుదల చేస్తారు. మెరిట్ వచ్చిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు. ఉద్యోగంలో చేరగానే 20వేల జీతంతో పాటు అలవెన్సులు కూడా ఉంటాయి .
జూన్ 30 చివరి తేదీ :
ఆర్ఆర్ బి లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి 2023 జూన్ 30 గా చివరి తేదీ నిర్ణయించారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోవాలనుకునే వారు పోస్ట్ ద్వారా మాత్రమే చేయవలసి ఉంటుంది. అఫీషియల్ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.