Viral video : ఉప్పుతో గీత గీస్తే నాగుపాము దాటలేదా..? ( వీడియో వైరల్)

Viral video : ఉప్పుతో గీత గీస్తే నాగుపాము దాటలేదా..? ( వీడియో వైరల్)

మనసాక్షి , ఇంటర్నెట్ :

నాగుపామును చూస్తే ఎవరికైనా ఒళ్ళు గగుర్పాటు పడుతుంది. భయంతో వనికి పోతారు. అక్కడి నుంచి పారిపోవాలని చూస్తారు. నాగు పాము బుస కొట్టడం , పడగ విప్పి తే మరింత గా అందరూ భయపడవలసిందే.

 

కానీ నాగుపాము విషయంలో గ్రామీణ ప్రాంతాల్లో అనేక అపోహలు ఉంటాయి. అపోహల కారణంగా అనేకమంది తమ ప్రాణాల మీదికి తెచ్చుకుంటారు. కొన్ని ప్రాంతాలలో ఉప్పుతో నాగబంధం వేస్తే నాగుపాము రాదనే అపోహ బలంగా ఉంది. ఉప్పుతో ఓ గీత లాగా చల్లితే నాగుపాము లోపటికి రాదనే అపోహ ఉంది.

 

ALSO READ : Gruhalaxmi : సొంత స్థలం ఉంటే తెలంగాణ గృహలక్ష్మి పథకం.. రూ. 3 లక్షలు ఇలా పొందండి..!

 

ఈ నమ్మకంలో నిజాలను తేల్చి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అపోహను తొలగించేందుకు యూట్యూబర్ ప్రయత్నం చేశారు. ఈ వీడియో వైరల్ గా మారింది.

 

ప్రజల్లో నాగుపాము ఉప్పుతో నాగబంధం వేసే విషయంపై అమిత్ కుమార్ అనే యూట్యూబర్ అవగాహన కల్పించారు. వీడియోలో కనిపించిన మాదిరిగానే ఉప్పును గుండ్రంగా ఓ గీతలా పోశాడు. ఆ తర్వాత రెండు నాగు పాములను దానిలో వదిలాడు.

 

ALSO READ : Phonepe : ఫోన్ పే లో ఉద్యోగాల భర్తీ .. ఏదైనా డిగ్రీ ఉంటే చాలు.. రూ. 35 వేల జీతం..!

 

అయితే ఓ నాగుపాము వెంటనే ఉప్పు గీతను దాటి బయటకు వచ్చేసింది . రెండో పాము కాసేపు ఆగి ఆ తర్వాత అది కూడా బయటకు వచ్చేసింది.

 

ఇదంతా చూసిన వారు అమిత్ కుమార్ పై ప్రశంసల జల్లు కురిపించారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అతడు చేసే ప్రయత్నం బాగుందని పొగడ్తలు కురిపించారు. అమిత్ కుమార్ చేసిన నాగుపాము… నాగబంధం పై అవగాహన కల్పిస్తూ తీసిన వీడియో ఇప్పటివరకు మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఈ వీడియో మీరు కూడా చూడండి.

 

VIDEO ….