Govt Job : నిరుద్యోగులకు శుభవార్త.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. నెలకు రూ. 81 వేల జీతం..!

Govt Job : నిరుద్యోగులకు శుభవార్త.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. నెలకు రూ. 81 వేల జీతం..!
మన సాక్షి, వెబ్ డెస్క్ :
కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త తెలియజేసింది. ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ వెలువడింది. కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇంటలిజెన్స్ బ్యూరో లో ఉద్యోగాలను భర్తీ చేయును. దీనిలో 797 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి.
నిరుద్యోగులు ఎంతో కాలంగా ఉద్యోగ సాధనకు కష్టపడుతున్నారు. కొంతమంది నిరుద్యోగులు యూనిఫామ్ ఉద్యోగాల్లో చేరడం ఎంతో క్రేజీగా భావిస్తుంటారు . అలాంటి వారికి మంచి అవకాశం ఇంటలిజెన్స్ బ్యూరో, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కేంద్ర సంస్థల పరిధిలో పనిచేయడానికి ఎంతోమంది నిరుద్యోగులు కలలు కంటుంటారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
ఉద్యోగానికి విద్యార్హత :
జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ 2 టెక్నికల్ ఉద్యోగాలు 797 ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు డిప్లమా ఇన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ , ఎలక్ట్రానిక్ అండ్ టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్, కంప్యూటర్ కంప్యూటర్ అప్లికేషన్స్ లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. లేదా బ్యాచిలర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్ లో ఫిజిక్స్ మ్యాథ్స్ సబ్జెక్టులు కలిగి ఉండాల్సి ఉంది. లేదా బీసీఏ అర్హత సాధించి ఉండాలి.
వయసు పరిమితి :
18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల లోపు వయసు ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ /బీసీ అభ్యర్థులకు వయసులో సడలింపు ఉంది. దరఖాస్తు ఫీజు 500 రూపాయలు చెల్లించాలి.
ఎంపిక విధానం :
ఇంటలిజెన్స్ బ్యూరో జూనియర్ ఇంటలిజెన్స్ ఆఫీసర్ ఉద్యోగాల ఎంపిక మూడు దశల్లో ఉంటుంది. పరీక్షలో 100 మార్కులు ఉంటాయి. ఇవి పూర్తిగా ఆబ్జెక్టివ్ టైప్ విధానంలో ఉంటుంది. జనరల్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి 25 మార్కులు, సంబంధిత సబ్జెక్టుల నుంచి 75 మార్కులు ఉంటాయి.
టైప్ టు విభాగంలో స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు. ఈ టెక్నికల్ టెస్ట్ కు సంబంధించి 30 మార్కులు ఉంటాయి. ఈ పరీక్ష సమయం రెండు గంటలు ఉంటుంది.
మూడవ దశలో ఇంటర్వ్యూ పర్సనాలిటీ టెస్ట్ నిర్వహిస్తారు. వీటికి 20 మార్కులు కేటాయించబడతాయి. నెగటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ప్రతి నాలుగు తప్పులకు ఒక మార్కు తగ్గిస్తారు.
దరఖాస్తు చివరి తేదీ :
ఈ పరీక్షకు దరఖాస్తులకు ఈనెల ( జూన్ 2023) 26వ తేదీ చివరి తేదీన నిర్ణయించారు. రెండు తెలుగు రాష్ట్రాలలో పరీక్ష కేంద్రాలు అభ్యర్థులకు అందుబాటులో ఉంటాయి. తెలంగాణలోని హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం ,మహబూబ్ నగర్ , వరంగల్ ప్రాంతాలలో సెంటర్లు ఉంటాయి. పూర్తి వివరాలకు mha.gov.in సంప్రదించవచ్చును.
ఎక్కువమంది చదివిన వార్తలు.. మీరు కూడా చదివేందుకు క్లిక్ చేయండి…👇
- Whatsapp Multi Account : వాట్సప్ అదిరిపోయే మల్టీ ఎకౌంటు ఫీచర్..!
- RRB Recruitment : 10th అర్హతతో రైల్వే ఉద్యోగాలు.. ఈనెలాఖరులోగా దరఖాస్తులు..!
- TSRTC : టిఎస్ ఆర్టీసి ప్రయాణికులకు బంపర్ ఆఫర్.. రూ .100 తో 60 కిలోమీటర్లు రాను పోను..!
- Inter : ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు… ట్రైనింగ్ లోనే నెలకు రూ. 25 వేల వేతనం..!
- GPay, PhonePe : గూగుల్ పే, ఫోన్ పే హ్యాకర్లు హ్యాక్ చేయకుండా ఏంచేయాలి..? తెలుసుకుందాం .. !