Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESUncategorizedజిల్లా వార్తలుతెలంగాణపెద్దపల్లి జిల్లా

Private : ప్రైవేటు పాఠశాలల్లో పుస్తకాల దందా..!

రామగుండం మండలంలో ప్రైవేటు పాఠశాలలో పుస్తకాల దందా జోరుగా సాగుతుంది. ఏటా పెరుగుతున్న ఫీజులకు పుస్తకాల భారం తోడు కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆర్థికంగా చితికి పోతున్నారు.

Private : ప్రైవేటు పాఠశాలల్లో పుస్తకాల దందా..!

లక్షల రూపాయల వ్యాపారం

వర్క్ బుక్స్ పేరిట దోపిడి

చెప్పిన వద్దే కొనాలని తల్లిదండ్రులపై ఒత్తిడి

కొన్న వాటికి రసీదులు ఇవ్వరు

గోదావరిఖని, మన సాక్షి

రామగుండం మండలంలో ప్రైవేటు పాఠశాలలో పుస్తకాల దందా జోరుగా సాగుతుంది. ఏటా పెరుగుతున్న ఫీజులకు పుస్తకాల భారం తోడు కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆర్థికంగా చితికి పోతున్నారు. ప్రభుత్వ పుస్తకాలకు అదనంగా వర్క్ బుక్స్ పేరుతో అవసరం లేకున్నా తప్పనిసరిగా పుస్తకాలు కొనాలని యాజమాన్యాలు చేస్తున్నారు. తల్లిదండ్రులు చేసేది ఏమీ లేక మౌనంగా భరిస్తున్నారు.

ప్రభుత్వం సూచించిన పుస్తకాలు నోట్ బుక్స్ కొనుగోలుకు పెద్దగా భారం లేకున్నా, ప్రైవేట్ యాజమాన్యాలు ఎంపిక చేసిన పుస్తకాలు కొనాలంటే తల్లిదండ్రులకు భారంగా మారింది. పలు కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలు పాఠశాల సమీపంలో దుకాణాలు ఏర్పాటు చేసి మరీ పుస్తకాలు విక్రయిస్తున్నారు. మరికొన్ని పాఠశాలలు ఏకంగా పాఠశాల ఆవరణలోనే అమ్మకాలు జరుపుతున్నారు.. ప్రైవేటు యాజమాన్యాలు పబ్లిషర్ తో చేతులు కలిపి పుస్తకాలను ఇష్టానుసారంగా అధిక ధరలకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు.

పదింతల అధిక ధరలకు విక్రయిస్తూ ఎమ్మార్పీ పై ఒక్క పైసా తగ్గకుండా అమ్మకాలు చేస్తూ అందిన కాడికి దోచుకుంటున్నారు.. పాఠశాల ఆవరణలో పుస్తకాలు అమ్మ రాదని, చెప్పిన వద్దే పుస్తకాలు కొనాలని ఒత్తిడి చేయవద్దని నిబంధన ఉన్నాయి. నిబంధన తుంగలో తొక్కుతూ తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయి. ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల సంఖ్యకు ఆనుగుణంగా పాఠ్యపుస్తకాల విక్రయాలను లెక్కిస్తే ఏటా కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతున్నట్లు తెలుస్తుంది.

రసీదులు ఉండవు :

ప్రైవేటు పుస్తకాల అమ్మకాల్లో స్కూల్ యాజమాన్యాలు ఎక్కడ లెక్కలు, రసీదులు కనిపించకుండా జాగ్రత్త పడుతున్నారు. చాలా పాఠశాలల్లో నగదు రూపంలో డబ్బులు స్వీకరిస్తున్నారు. పుస్తకాల కొనుగోలుకు సంబంధించిన బిల్లులు ఇవ్వడం ఇవ్వకుండా వ్యాపారం గుట్టుగా చేస్తున్నారు. ఎవరైనా రసీదులు కావాలని ప్రశ్నిస్తే తెల్ల కాగితంపై సంతకం పెట్టి ఇస్తున్నారు.. ప్రైవేట్ యాజమాన్యాల దోపిడీ బయటపడకుండా గుట్టుగా వ్యాపారం చేస్తున్నారు.

పట్టింపు లేని అధికారులు :

ప్రైవేటు పాఠశాలల దోపిడీని నియంత్రించాల్సిన అధికారులు పట్టించుకోవడంలేదని ఆరోపణలు ఉన్నాయి. సంబంధిత విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ పూర్తిగా కరువైంది. అధికారులు చూసి చూడనట్టు ఉండటం తో ప్రైవేటు దోపిడీ అడ్డు అదుపు లేకుండా పోతుంది. కళ్ల ముందే పుస్తకాల దందా నడుస్తున్న చర్యలు తీసుకోవడంలో విఫలం అవుతున్నారు. ఫిర్యాదు చేస్తే తప్ప అధికారుల్లో కదలడం లేదు. ఫిర్యాదులపై తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాల్సిన అధికారులు నామమాత్ర తనిఖీలతో సరి పెడుతున్నారు. అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తుండడంతో ప్రైవేటు దోపిడీకి అదుపు లేకుండా పోతుంది.

మరిన్ని వార్తలు