RBI : రూ. 2 వేల నోట్ల రద్దు పై ఆర్బీఐ గవర్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

RBI : రూ. 2 వేల నోట్ల రద్దు పై ఆర్బీఐ గవర్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

మనసాక్షి , వెబ్ డెస్క్ :

రూ. 2 వేల నోట్ల రద్దు పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ శక్తి కాంత్ దాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన ఆసక్తికరమైన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి. రూ. 2000 నోటు ఉపసంహరణ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ పై ఏమైనా ప్రభావం చూపుతుందా..? అనే ప్రశ్నకు ఆర్బీఐ గవర్నర్ శక్తి కాంత్ దాస్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు.

 

పెద్ద నోటు 2000 రూపాయల నోటు ఉపసంహరణ ప్రకటించిన నెల రోజుల వ్యవధిలోనే మూడింట రెండు వంతుల నోట్లు వ్యవస్థలోకి వచ్చాయని తెలిపారు. ఈ నిర్ణయం ఆకస్మాత్తుగా అయినప్పటికీ క్లీన్ నోట్ పాలసీలో భాగంగా ఈ ఏడాది మే 19వ తేదీన రద్దు నిర్ణయాన్ని ప్రకటించినట్లు స్పష్టత ఇచ్చారు.

 

ALSO RAED :

 

మార్చి 31వ తేదీ నాటికి 3.62 లక్షల కోట్ల విలువైన రెండు వేల రూపాయల నోట్లు ఆర్థిక వ్యవస్థలో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. 3.62 లక్షల కోట్లలో 2.41 లక్షల కోట్ల విలువైన రెండు వేల రూపాయల నోట్లు వ్యవస్థలోకి వచ్చాయని తెలియజేశారు.

 

ఈ విషయాలన్నీ ఆయన ఒక ఇంటర్వ్యూలో వివరించారు. 2000 రూపాయల నోట్ల మార్పిడికి 2023 సెప్టెంబర్ 30వ తేదీ నాటికి వరకు గడువు ఉన్నట్లు పేర్కొన్నారు. కానీ నోట్ల మార్పిడి కోసం ప్రజలు ఎగబడుతున్నారని అన్నారు. 2000 రూపాయల నోట్ల ఉపసంహరణ ఆర్ధిక స్థిరత్వం పై ఎలాంటి ప్రభావం చూపదని స్పష్టం చేశారు .

 

మార్చి 31వ తేదీ నాటికి 2000 రూపాయల నోట్లలో తిరిగి వచ్చినవి 50 శాతమేనని తెలిపారు. వాటిలో 85% డిపాజిట్లు కాగా మిగతావి మార్పిడి జరిగినట్టు తెలిపారు. జూన్ 8 నాటికి 1.8 లక్షల కోట్ల విలువైన రెండు వేల రూపాయల నోట్లు సర్కులేషన్ లోకి వచ్చాయని తెలియజేశారు.