Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESఆంధ్రప్రదేశ్జిల్లా వార్తలుటెక్నాలజీతెలంగాణహైదరాబాద్

Pink WhatsApp: అప్ గ్రేడ్ పేరుతో పింక్ వాట్సప్.. ఆ మోసం ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిందే..!

Pink WhatsApp: అప్ గ్రేడ్ పేరుతో పింక్ వాట్సప్.. ఆ మోసం ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిందే..!

మనసాక్షి , వెబ్ డెస్క్ :

సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త ఎత్తులతో ట్రాప్ చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కొద్దిసేపు వాట్సప్ పనిచేయకపోతే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో..? అందరికి తెలుసు. వాట్సప్ లేకుంటే జీవిత గమనం కూడా ఆగిపోయినంతగా ఫీలయ్యే వారు ఉంటారు. వాట్సప్ ఉన్న ప్రజాదరణ మరే యాప్ కు లేకుండా పోయింది.

 

కాగా దానిని సైబర్ నేరగాల్లు ఆసరగా చేసుకుని అప్ గ్రేడ్ వెర్షన్ పేరుతో పింక్ వాట్సాప్ ను తెరమీదకి తీసుకొచ్చారు. ప్రజల అవగాహన రాయిత్యాన్ని పెట్టుబడిగా చేసుకుంటున్నారు. కొత్త ఎత్తులతో ముందుకు వచ్చారు.

 

వాట్సాప్ లోగో మారిందని, కొత్త ఫీచర్లతో మరింత సౌకర్యంగా ఉంటుందని సమాచారంతో పింక్ వాట్సాప్ ను తెరమీదకి తీసుకొచ్చారు. కాగా పింక్ వాట్సప్ జోలికి అస్సలు వెళ్ళద్దు… అదొక భయంకరమైన ట్రప్ గా సైబర్ నిపుణులు పేర్కొంటున్నారు.

 

♦️ ఎక్కువ మంది చదివిన వార్తలు.. మీరు కూడా చదివేందుకు క్లిక్ చేయండి 👇

➡️ Viral Video : మోటార్‌సైకిల్‌పై ప్రేమికుల విచిత్ర సంఘటన, రూ. 21 వేలు చలాన్ ( వీడియో వైరల్)
➡️ CM KCR : సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం .. 30వ తేదీ నుంచి పంపిణీ షురూ..!
➡️ CM KCR : సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం .. 30వ తేదీ నుంచి పంపిణీ షురూ..!
➡️ Good News : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు, పింఛన్ దారులకు గుడ్ న్యూస్..!
➡️ Rythu Bandhu scheme : రైతుబంధుపై కీలక ప్రకటన.. రైతులకు గుడ్ న్యూస్…!

 

ఈ మోసం పైన ముంబై, కర్ణాటక ,కేరళతోపాటు పలు రాష్ట్రాల పోలీసులు ప్రచారం కూడా చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా పింక్ వాట్సప్ పేరుతో వల విసిరే సైబర్ నేరస్తుల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

 

వాట్స్అప్ లో మరిన్ని సదుపాయాలు కావాలంటే పింక్ వాట్సప్ లోకి రావాలంటే మెసేజ్ లు, లింకులు పంపుతున్నారు. ఆ లింకులను అసలు ముట్టుకోవద్దు అంటున్నారు. వాటిని ఏమాత్రం టచ్ చేసినా.. బ్యాంకు ఖాతా, ఓటిపి లాంటి వివరాలు సైబర్ నెరగాల చేతుల్లోకి వెళ్లిపోతాయి.

 

అంతేకాకుండా వినియోగదారుడు మొబైల్ యాక్సిస్ మొత్తం వారి చేతిలోకే వెళుతుంది. ఒకవేళ పింక్ వాట్సప్ వాడుతుంటే వెంటనే దాన్ని తొలగించి ఫోన్ బ్యాకప్ చేసుకోవాలని హెచ్చరిస్తున్నారు.

మరిన్ని వార్తలు