Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsతెలంగాణవ్యవసాయం

Rythu Bharosa : రైతు భరోసా నిధులు విడుదల సందేశాలు.. వ్యవసాయ శాఖ క్లారిటీ..!

తెలంగాణలో రైతు భరోసా నిధులు విడుదల అయ్యాయంటూ కొన్ని జిల్లాలలో ప్రచారం జరుగుతోంది. నిధులు ఖాతాలలో జమ అయినట్లుగా రైతులకు బుధవారం ఉదయం మెసేజ్ లు వచ్చినట్లు వ్యవసాయ శాఖ దృష్టికి వచ్చింది. ఈ విషయంపై వ్యవసాయ శాఖ క్లారిటీ ఇచ్చింది.

Rythu Bharosa : రైతు భరోసా నిధులు విడుదల సందేశాలు.. వ్యవసాయ శాఖ క్లారిటీ..!

మన సాక్షి, వెబ్ డెస్క్:

తెలంగాణలో రైతు భరోసా నిధులు విడుదల అయ్యాయంటూ కొన్ని జిల్లాలలో ప్రచారం జరుగుతోంది. నిధులు ఖాతాలలో జమ అయినట్లుగా రైతులకు బుధవారం ఉదయం మెసేజ్ లు వచ్చినట్లు వ్యవసాయ శాఖ దృష్టికి వచ్చింది. ఈ విషయంపై వ్యవసాయ శాఖ క్లారిటీ ఇచ్చింది.

Also Read : తెలంగాణలో తీవ్ర విషాదం.. బోట్లు తిరగబడి 10 మంది గల్లంతు..!

రైతులకు రైతు భరోసా నిధులు విడుదలైనట్లు వచ్చిన మెసేజ్ లపై అధికారులు విచారణ జరిపారు. దానిపై సాంకేతిక సంస్థలతో కూడా చర్చించారు. ఆ తర్వాత మెసేజ్ లు వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు వెళ్లలేదని నిర్ధారించారు. అలాంటి వార్తలను రైతులు నమ్మవద్దని సూచించారు. రైతు భరోసా నిధుల విడుదల అంశం ప్రభుత్వం నేరుగా ప్రకటిస్తుందని పేర్కొన్నారు.

Also Read : బాలుడి దత్తత కేసులో మళ్ళీ బిగ్ ట్విస్ట్.. ప్రభుత్వ అప్పీలు.. విచారణ వాయిదా వేసిన హైకోర్టు..!

సైబర్ నేరగాళ్ల పన్నాగం అయి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. ఈ మెసేజ్ లపై నిజా నిజాలను నిర్ధారించేందుకు సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం అందించారు. దీనిపై పూర్తి విచారణ చేపట్టాలని సైబర్ క్రైమ్ విభాగానికి వ్యవసాయ శాఖ లేఖ రాసింది.

మరిన్ని వార్తలు