మంత్రి రాజనర్సింహ వర్సెస్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు.. టిపిసిసికి చేరిన వివాదం..!
తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య విభేదాలు పార్టీకి తలనొప్పిగా మారాయి. ప్రతి జిల్లాలో ఇలాంటి పరిస్థితులు నెలకొనడంతో రాష్ట్రవ్యాప్తంగా అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుల వివాదాలు చర్చనీ అంశంగా మారాయి. తాజాగా మంత్రి దామోదర రాజనర్సింహ జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావుల మధ్య వివాదం జరిగినట్టుగా పార్టీలో కలకలం రేపుతుంది.

మంత్రి రాజనర్సింహ వర్సెస్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు.. టిపిసిసికి చేరిన వివాదం..!
మన సాక్షి, వెబ్ డెస్క్:
తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య విభేదాలు పార్టీకి తలనొప్పిగా మారాయి. ప్రతి జిల్లాలో ఇలాంటి పరిస్థితులు నెలకొనడంతో రాష్ట్రవ్యాప్తంగా అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుల వివాదాలు చర్చనీ అంశంగా మారాయి. తాజాగా మంత్రి దామోదర రాజనర్సింహ జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావుల మధ్య వివాదం జరిగినట్టుగా పార్టీలో కలకలం రేపుతుంది. నేషనల్ మీడియాలో కూడా కథనాలు రావడంతో వ్యవహారాన్ని టిపిసిసి తీవ్రంగా పరిగణించినట్లు తెలుస్తోంది.
అందులో భాగంగా రేపు (గురువారం) ఇరువురిని పిసిసి కార్యాలయానికి రావలసిందిగా ఆదేశించినట్లు సమాచారం. క్రమశిక్షణ రాహిత్యం పై ఇరువురి నేతలతో చర్చించే అవకాశాలు ఉన్నాయి. ఇద్దరి నేతలతో విడివిడిగా మాట్లాడటంతో పాటు వీలైతే ఇరువురిని ఒకే వేదికపై కూర్చోబెట్టి మాట్లాడే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది.
Also Read : కరీంనగర్‌లో మాటల యుద్ధం.. బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ..!
ఢిల్లీలో జరిగింది ఏమిటి?
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి జ్ఞానేష్ కుమార్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇండియా కూటమి రామ్ లీలా మైదానంలో నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు, పెద్ద ఎత్తున ఢిల్లీకి వెళ్లారు.
కాగా ఢిల్లీలోని హోటల్లో మంత్రి దామోదర రాజనర్సింహ తనపై వ్యక్తిగత దోషాలకు దిగారని తీవ్రపరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు ఆరోపించినట్లు మీడియాలో కథనాలు వెలుపడ్డాయి. ఈ వ్యవహారం తారాస్థాయికి చేరింది. అభివృద్ధి పనులు, నామినేటెడ్ పదవులు, పార్టీ వ్యవహారాల విషయంలో వీరిద్దరికీ వివాదం తలెత్తినట్లుగా తెలుస్తోంది.









