Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణభద్రాద్రి కొత్తగూడెం జిల్లా

చిల్లర కోసం కండక్టర్ ను బస్సు నుంచి కిందికి నెట్టివేసిన ప్యాసింజర్.. చికిత్స పొందుతూ కండక్టర్ మృతి..!

చిల్లర కోసం మహిళ ప్యాసింజర్ కండక్టర్ తో గొడవపడి కిందికి తోసేసిన ఘటనలో చికిత్స పొందుతూ ఆ కండక్టర్ మంగళవారం రాత్రి మృతి చెందారు.

చిల్లర కోసం కండక్టర్ ను బస్సు నుంచి కిందికి నెట్టివేసిన ప్యాసింజర్.. చికిత్స పొందుతూ కండక్టర్ మృతి..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

చిల్లర కోసం మహిళ ప్యాసింజర్ కండక్టర్ తో గొడవపడి కిందికి తోసేసిన ఘటనలో చికిత్స పొందుతూ ఆ కండక్టర్ మంగళవారం రాత్రి మృతి చెందారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు వద్ద ఈ నెల 25 న కొడుకుతో కలిసి భద్రాచలం వెళ్లే బస్సు అశ్వాపురం మండలం మిట్టగూడెం వద్ద మౌనిక అనే మహిళ ఎక్కింది. కాగా కొడుకుకు టికెట్ ఇవ్వమని పది రూపాయల టికెట్ కు వంద రూపాయలు ఇచ్చింది.

Also Read : రైతు ఖాతా నుంచి ధాన్యం అమ్మిన రూ.5 లక్షలు మాయం..!

మిగతా చిల్లర టికెట్ వెనక కండక్టర్ ప్రవళిక రాసి ఇచ్చారు. కానీ తనకు చిల్లర ఇప్పుడే ఇవ్వాలని కండక్టర్ తో ఆమె వివాదానికి దిగింది. ఈ వివాదంలో కండక్టర్ ను బస్సు నుంచి కిందికి నెట్టివేసింది. దాంతో కండక్టర్ ప్రవళిక కాళ్లపై నుంచి బస్సు వెనుక టైర్లు వెల్లగా విరిగిపోయి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా ఎల్బీనగర్ సంజీవని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళా కండక్టర్ ప్రవళిక మంగళవారం రాత్రి మృతి చెందారు.

మరిన్ని వార్తలు