Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంఖమ్మం జిల్లాజిల్లా వార్తలుతెలంగాణ

తెలంగాణలో తీవ్ర విషాదం.. బోట్లు తిరగబడి 10 మంది గల్లంతు..!

తెలంగాణలో తీవ్ర విషాదం నెలకొన్నది. బోట్లు తిరగబడి పదిమంది నిద్రఫ్ పోలీస్ కానిస్టేబుల్ లు గల్లంతయ్యారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

తెలంగాణలో తీవ్ర విషాదం.. బోట్లు తిరగబడి 10 మంది గల్లంతు..!

మన సాక్షి, వెబ్ డెస్క్:

తెలంగాణలో తీవ్ర విషాదం నెలకొన్నది. బోట్లు తిరగబడి పదిమంది నిద్రఫ్ పోలీస్ కానిస్టేబుల్ లు గల్లంతయ్యారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంలో చిక్కుకున్న మత్స్యకారులను కాపాడేందుకు పదిమంది NDRF పోలీస్ కానిస్టేబుల్ లు ప్రయాణిస్తున్న రెండు ఎన్ డి ఆర్ ఎఫ్ బోట్లు తిరగబడి గల్లంతయ్యారు.

ఖమ్మం జిల్లాలోని బేతుపల్లి చెరువులో ఐదుగురు మత్స్యకారులు ప్రమాదవశాత్తు చిక్కుకున్నారు. వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చేందుకుగాను 10 మంది NDRF పోలీస్ కానిస్టేబుళ్లు రెండు బోట్లలో చెరువులోకి వెళ్లారు. ఈ క్రమంలో నేటి ప్రవాహం పెరగటం, గాలికి రెండు బోట్లు కూడా ఒకేసారి నీటిలో తిరగబడ్డాయి. దాంతో బోట్లలో ఉన్న పదిమంది కానిస్టేబుళ్లు చెరువులో మునిగి గల్లంతయ్యారు.

Also Read : చిల్లర కోసం కండక్టర్ ను బస్సు నుంచి కిందికి నెట్టివేసిన ప్యాసింజర్.. చికిత్స పొందుతూ కండక్టర్ మృతి..!

కాగా సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు, రెస్క్యూ టీం, గజ ఈతగాళ్లు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని రక్షణ చర్యలు చేపట్టారు. గల్లంతైన కానిస్టేబుల్ కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటన ఉత్కంఠతకు నెలకొన్నది.

రాత్రి వరకు నలుగురు సిబ్బందిని గుర్తించి ఒడ్డుకు చేర్చినట్లు తెలుస్తోంది. మరో ఆరుగురు ఎన్టీఆర్ ఎఫ్ సిబ్బంది జాడ తెలియలేదు. గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఎన్ డి ఆర్ ఎఫ్ బోట్లు గల్లంతుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆరా తీశారు. సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ ఘటనపై సమీక్షిస్తున్నారు.

మరిన్ని వార్తలు