Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజగిత్యాల జిల్లాజిల్లా వార్తలుతెలంగాణ

బాలుడి దత్తత కేసులో మళ్ళీ బిగ్ ట్విస్ట్.. ప్రభుత్వ అప్పీలు.. విచారణ వాయిదా వేసిన హైకోర్టు..!

మూడేళ్లు బాలుడి దత్తత కేసులో మళ్ళీ బిగ్ ట్విస్ట్ నెలకొన్నది. ప్రభుత్వ అప్పీలుపై విచారణకు హైకోర్టు వాయిదా వేసింది.

బాలుడి దత్తత కేసులో మళ్ళీ బిగ్ ట్విస్ట్.. ప్రభుత్వ అప్పీలు.. విచారణ వాయిదా వేసిన హైకోర్టు..!

(మన సాక్షి, జగిత్యాల – అజయ్ )

మూడేళ్లు బాలుడి దత్తత కేసులో మళ్ళీ బిగ్ ట్విస్ట్ నెలకొన్నది. ప్రభుత్వ అప్పీలుపై విచారణకు హైకోర్టు వాయిదా వేసింది. దత్తత తీసుకున్నట్లు చెబుతున్న దంపతులకు మూడేళ్ల బాలుడి కస్టడీని తిరిగి అప్ప గించాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ అప్పీలుపై విచారణను హైకోర్టు నవంబర్ 18కు వాయిదా వేసింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి.శామ్ కోశీ, జస్టిస్ సుద్దాల చలపతిరావులతో కూడిన ధర్మాసనం బుధవారం ప్రభుత్వ అప్పీలును విచారించింది.

జగిత్యాల జిల్లాకు చెందిన కాసరపు సరిత, కాసరపు శ్రీనివాస్ దంపతులు తమ దత్తపుత్రుడైన మూడేళ్ల రుద్ర మహేష్ ను బాలల సంరక్షణ అధికారులు బలవంతంగా తమ నుంచి తీసుకెళ్లారని హైకోర్టును ఆశ్రయించారు. 2023, నవంబర్ 26న బాలుడి వాస్తవ తల్లిదండ్రులు స్వచ్ఛందంగా దత్తత పత్రం ద్వారా తమకు అప్పగించారని పేర్కొంటూ బాలుడి కస్టడీని తిరిగి అప్పగించాలని కోరారు. దీనిపై సింగిల్ జడ్జి బాలుడిని దంప తులకు అప్పగించాలని గత నెల అధికారులను ఆదేశించారు.

Also Read : తెలంగాణలో తీవ్ర విషాదం.. బోట్లు తిరగబడి 10 మంది గల్లంతు..!

కాగా ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ మహిళా, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి, ఆ శాఖ డైరెక్టర్, బాలల సంక్షేమ కమిటీ (సీడబ్ల్యూసీ), జగిత్యాల కలెక్టర్ తదితర అధికారులు అప్పీలు దాఖలు చేశారు. దత్తత చట్టబద్ధత వివాదాస్పదమని, హిందూ దత్తత, పోషణ చట్టం- 1956 ప్రకారం దాని చెల్లుబాటును పరిశీలించాల్సి ఉందని పేర్కొన్నారు. ఆగస్టు 24న చైల్డ్ హెల్ప్ లైన్ కు అందిన సమాచారం ఆధారంగా సీడబ్ల్యూసీ బాలుడిని సంరక్షణలోకి తీసుకుందని, ఈ వ్యవహారం దర్యాప్తు నడుస్తోందన్నారు.
సింగిల్ జడ్జి ఉత్తర్వుల అమలును నిలిపివేయాలని ప్రభుత్వం కోరింది. జిపి విజ్ఞప్తి మేరకు అప్పీలుపై తదుపరి విచారణను ధర్మాసనం నవంబర్ 18కు వాయిదా వేసింది.

మరిన్ని వార్తలు