Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIEStravelజిల్లా వార్తలుతెలంగాణహైదరాబాద్

TSRTC : పల్లె వెలుగు ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ బంపర్ ఆఫర్.. బస్సు పాస్ ల అమలుకు నిర్ణయం..!

TSRTC : పల్లె వెలుగు ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ బంపర్ ఆఫర్.. బస్సు పాస్ ల అమలుకు నిర్ణయం..!

హైదరాబాద్, మనసాక్షి :

పల్లె వెలుగు ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ప్రయాణికులకు ఆర్థిక భారం తగ్గించేందుకు ఆ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. “పల్లె వెలుగు టౌన్ బస్ పాస్ ” లను అందజేసేందుకు శ్రీకారం చుట్టింది . ఈనెల జూలై 18వ తేదీ నుంచి బస్ పాస్ లు అందజేయనున్నారు.

 

రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా కరీంనగర్, మహబూబ్ నగర్, నిజామాబాద్, నల్లగొండ జిల్లా కేంద్రాలలో తిరిగే పల్లె వెలుగు బస్సులలో ” పల్లె వెలుగు టౌన్ బస్ పాస్” ను అమలు చేయాలని నిర్ణయించింది. 5 నుంచి 10 కిలోమీటర్ల పరిధిలో ఈ బస్ పాస్ లు అందజేయాలని సంస్థ నిర్ణయించింది.

 

కరీంనగర్, మహబూబ్ నగర్ లలో 10 కిలోమీటర్లు, నిజామాబాద్, నల్లగొండలో 5 కిలోమీటర్ల పరిధిలో అపరిమితంగా ప్రయాణించేందుకు ఈ బస్ పాస్ లను జారీ చేయనున్నారు.

 

టి ఎస్ ఆర్ టి సి అధికారులతో కలిసి ఎండి సజ్జనార్ పల్లె వెలుగు టౌన్ బస్ పాస్ పోస్టర్ ను ఆవిష్కరించారు. పది కిలోమీటర్ల పరిధికి గాను పల్లె వెలుగు టౌన్ బస్ పాస్ కు నెలకు 800 రూపాయలు, ఐదు కిలోమీటర్ల పరిధికి గాను 500 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. జనరల్ టౌన్ బస్ పాస్ సౌకర్యం హైదరాబాద్ , వరంగల్ బస్సు పాసులలో అందుబాటులలో ఉంది.

 

ప్రయాణికుల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు నూతనంగా కరీంనగర్ మహబూబ్ నగర్, నిజామాబాద్, నల్లగొండ జిల్లా కేంద్రాలలో టౌన్ బస్ పాసులను ప్రవేశపెడుతున్నారు. జిల్లా కేంద్రాల్లో ఉద్యోగులు, చిరు వ్యాపారులు ఎక్కువగా రాకపోకలు సాగిస్తుంటారు. వారి ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు పల్లె వెలుగు బస్సు పాసులు అందుబాటులోకి వచ్చాయి.

 

పోస్టర్ల ఆవిష్కరణ అనంతరం ఎండి సజ్జనార్ మాట్లాడుతూ.. ప్రయాణికుల నుంచి వచ్చే స్పందనను బట్టి మరికొన్ని ప్రాంతాలలో కూడా టౌన్ బస్ పాస్ లను విస్తరించనున్నట్లు తెలిపారు. ఈ పాస్ కు సంబంధించిన పూర్తి వివరాల కోసం టి.ఎస్.ఆర్.టి.సి కాల్ సెంటర్ ల నెంబర్లు 040 – 69440000, 040 – 23450033 కి సంప్రదించాలని ఆయన సూచించారు.

 

ALSO READ : 

1. Tourism : తిరుమల, షిర్డీ భక్తులకు గుడ్ న్యూస్.. పర్యాటక శాఖ ప్రత్యేక ప్యాకేజీలు..!

2. SBI : ఎస్ బీ ఐ కస్టమర్లకు గుడ్ న్యూస్.. హోమ్ లోన్ తీసుకునే వారికి మరింత ఊరట..!

3. Steel Bridge : తెలంగాణలో స్టీల్ బ్రిడ్జి.. ప్రారంభానికి సిద్ధం..!

4. Runa Mafi : తెలంగాణలో రైతుల పంట రుణాలు మాఫీ.. ఎప్పుడంటే..!

5. Eamcet Counseling : తెలంగాణ ఎంసెట్ ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు.. రిపోర్టు ఎప్పుడు చేయాలో తెలుసుకుందాం..!

మరిన్ని వార్తలు